పాఠశాల తరలించొద్దు

ABN , First Publish Date - 2022-07-06T05:59:12+05:30 IST

పాఠశాల తరలించొద్దు

పాఠశాల తరలించొద్దు
హెచ్‌ఎంకు వినతిపత్రాన్ని అందిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

 కాళ్ల, జూలై 5: ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని కాళ్లకూరు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని ఎంపీయూపీ పాఠశాలను కాళ్ల హైస్కూల్‌లో కలిపివేస్తారని తెలియడంతో గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు మంగళవారం పాఠశాల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామంలోని హరిజనపేట, వెంకటాపురం, కాళ్లకూరు గరువుకు చెందిన ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చాలా మంది చదువుకుంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. 6,7,8 తరగతుల విద్యార్థులను కాళ్ల హైస్కూల్‌కు వెళ్లమనడం దారుణమన్నారు. రాష్ట్రీయ రహదారి వెంబడి 4 కిలోమీటర్లు దూరంలో ఉన్న పాఠశాలకు నడుస్తూ వెళితే ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తమ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలకు 9, 10 తరగతులకు అనుమతులు ఇప్పించాలని ప్రధానోపాధ్యాయుడికి వినతిపత్రం అందజేశారు. జిల్లా ఉన్నతాధికారులకూ తమ గోడును తెలుపుతామన్నారు. వేగేశ్న వెంకటగోపాలకృష్ణంరాజు, సాధుశ్రీదేవి, నడింపల్లి ప్రదీప్‌రాజు, దావులూరి కరుణమ్మ పాల్గొన్నారు.


Updated Date - 2022-07-06T05:59:12+05:30 IST