మారుమూల పల్లెలు కనిపించడం లేదా?

ABN , First Publish Date - 2021-01-24T05:52:06+05:30 IST

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, ఐదేళ్లు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఎమ్మెల్యేకు మారుమూల గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ధ్యాస కనిపించడం లేదా? అని ఎంపీ సోయంబాపురావ్‌ అన్నారు.

మారుమూల పల్లెలు కనిపించడం లేదా?
మాట్లాడుతున్న ఎంపీ సోయం బాపురావ్‌

ఆదిలాబాద్‌ రూరల్‌, జనవరి 23: నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, ఐదేళ్లు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఎమ్మెల్యేకు మారుమూల గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ధ్యాస కనిపించడం లేదా? అని ఎంపీ సోయంబాపురావ్‌ అన్నారు. శనివారం మండలంలోని కచ్చికంటి, చిట్యాల బోరి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఎంపీ మాట్లాడుతూ ఈ గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం కల్పించడంలో పాలక ప్రభుత్వం విఫలమైందని, కనీస రవాణా సౌకర్యాలు లేవన్నారు. వాగుపై వంతెన నిర్మాణం కూడా చేపట్ట లేకపోయారన్నారు. దీంతో ఈ గ్రామాల ప్రజలు వర్షా కాలంలో నరకం అనుభవించాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. అనంతరం ఆయా గ్రామాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో బీజేపీజిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌, నాయకులు లాలామున్నా, మహేశ్‌చంద్ర, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇంద్రవెల్లి: రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సకు బీజేపీనే ప్రత్యామ్నామని, 2023లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరుతుందని ఎంపీ సోయం బాపురావు అన్నారు. శనివారం మండలంలోని ముత్నూర్‌లో గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్‌ కేంద్రే బాలాజీ ఆధ్వర్యంలో 50మంది యువకులతో కలిసి  ఎంపీ సోయం బాపురావు సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ముందుగా కుమ్రం భీం విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇందులో ఎంపీపీ పోటే శోబాబాయి, జడ్పీటీసీ   అర్క పుష్పలత, బీజేపీ జిల్లా అద్యక్షుడు పాయల శంకర్‌, బీజపీ పార్టీ మహిళ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహసిని రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-24T05:52:06+05:30 IST