Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎంఆర్‌సీ గ్రాంటు తగ్గించ వద్దు

 డీఈవో చంద్రకళకు ఎంఈవోల సంఘం ప్రతినిధుల వినతి

పాయకరావుపేట, డిసెంబరు 1 :  ఏటా మండల రిసోర్స్‌ సెంటర్‌ (ఎంఆర్‌సీ)లకు కేటాయిస్తున్న గ్రాంటును తగ్గించ వద్దని మండల విద్యా శాఖాధికారుల సంఘం  ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విశాఖపట్నంలో బుధవారం డీఈవో చంద్రకళను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈవోల సంఘం జిల్లా అధ్యక్షులు కేఎన్‌ గాంధీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంఆర్‌సీలకు ఇచ్చే గ్రాంటు రూ.1.25 లక్షలను రూ.75 వేలకు తగ్గించడం వల్ల ఎంఈవోలపై తీవ్ర భారం పడుతుందన్నారు. జిల్లాలో 43 మండలాలకు 17 మంది ఎంఈవోలు మాత్రమే ఉన్నారని, ఒక్కొక్కరూ మూడు మండలాల బాధ్యతలు నిర్వహిస్తుండడం వల్ల పనిభారం పెరిగిందన్నారు. దీంతోపాటు గ్రామాల్లో తిరుగుతూ ఓటీఎస్‌ సర్వే పనులు, జగనన్న విద్యా కానుక పంపిణీ తదితర అదనపు విధులు కూడా  చేప డుతున్నట్టు చెప్పారు. ఎంఆర్‌సీలకు ఇచ్చే గ్రాంట్‌ను తగ్గించకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి రవీంద్ర,  సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రోయల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement