మున్సిపాలిటీలలో పన్నులను పెంచొద్దు

ABN , First Publish Date - 2021-08-02T05:48:20+05:30 IST

మున్సిపాలిటీ లలో పన్నుల పెంచి ప్రజలపై భారం మోపవద్దని మా జీమంత్రి పల్లెరఘునాథరె డ్డి పేర్కొన్నారు.

మున్సిపాలిటీలలో పన్నులను పెంచొద్దు
కరణం నారాయణరావు చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న మాజీ మంత్రి పల్లె

మాజీ మంత్రి పల్లె

   పుట్టపర్తి, ఆగస్టు 1: మున్సిపాలిటీ లలో పన్నుల పెంచి ప్రజలపై భారం మోపవద్దని మా జీమంత్రి పల్లెరఘునాథరె డ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానికంగా జరిగిన కరణం నారాయణరావు వర్ధంతిలో పాల్గొని నివాళులర్పిం చారు. అనంత రం పల్లె విలేకరులతో మాట్లాడుతూ.... సత్యసాయి శివైక్యం తరువాత పుట్టప ర్తిలో అన్నివర్గాల జీవనప్రమాణాలు అంతం త మాత్ర మే ఉన్నాయని, దీనికి తోడు కరో నాతో కూడా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే  ప్రభుత్వం మున్సిపాలిటీలో పన్నులను పెంచుతోందని మండిపడ్డారు. ప్రస్తుత తరుణంలో ఆస్తివిలువ ఆధారంగా 15శాతం పెంచడం ప్రజలకు పెనుభారంగా మారుతోందన్నారు.  రెండేళ్లగా వ్యాపార దుకాణాలు, లాడ్జ్‌లు, హోటళ్లు మూతపడ్డాయన్నారు. పుట్టపర్తికి వచ్చే పర్యాటకులపై ఇక్కడ అబివృద్ధి ఉంటుందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగియాని, వీటికి తోడు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచారని ఇన్ని ఇబ్బందులలో కొత్త పన్నులు విధిస్తే ప్రజలు ఎలా కడతారంటూ ప్రశ్నిం చారు. తెలుగుదేశం ప్రభుత్వంలోని పథకా లను పేర్లు మార్చి వాటిని అమలు చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వంమారకపోతే ప్ర జాగ్రహం గురికాక తప్పదన్నారు. పల్లెవెంట సామకోటి ఆదినారాయణ, మాజీ మున్సిపల్‌ చైర్మన విద్యాసాగర్‌, బేకరినాయుడు, షామీర్‌, అల్లాబకష్‌, చెన్నకేశవులు, గంగిశెట్టి, శేషులు ఉన్నారు.


Updated Date - 2021-08-02T05:48:20+05:30 IST