తపాలా శాఖను ప్రైవేటీకరించొద్దు

ABN , First Publish Date - 2022-08-11T05:25:45+05:30 IST

తపాలాశాఖను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించరాదని గ్రూప్‌-సీ ఉద్యోగులు కోరారు. ఈ మేరకు బుధవారం స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఒకరోజు సమ్మె చేపట్టారు.

తపాలా శాఖను ప్రైవేటీకరించొద్దు
నిరసన వ్యక్తం చేస్తున్న తపాలా శాఖ ఉద్యోగులు

 ఉద్యోగుల ఒకరోజు సమ్మె

పార్వతీపురంటౌన్‌, ఆగస్టు 10 : తపాలాశాఖను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించరాదని గ్రూప్‌-సీ ఉద్యోగులు కోరారు. ఈ మేరకు బుధవారం స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఒకరోజు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా  డివిజన్‌ తపాలాశాఖ గ్రూపు-సీ ఉద్యోగుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు మణిమాల, రవీంరఽధనాథ్‌ మాట్లాడుతూ..   నూతన ఆర్థిక విధానాలు, సంస్కరణల పేరుతో తపాలాశాఖ ప్రైవేటీకరణకు అడుగులు వేయడం సరికాదన్నారు. 60 శాతం ఆదాయాన్ని తెచ్చే చిన్న మొత్తాల పొదుపు ఖాతాలను ప్రైవేట్‌ లిమిటెడ్‌లకు మళ్లించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయడం బాధకరమని తెలిపారు.   30కోట్ల చిన్న మొత్తాల పొదుపు ఖాతాల్లో ఉన్న సుమారు రూ. 13 లక్షల కోట్ల ప్రజాధనాన్ని   పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  తపాలాశాఖలో గ్రూప్‌-సీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.  ఈ నిరసనలో  పోస్టుమెన్‌, ఎంటీఎస్‌ కార్యదర్శి ఉమాశంకరరావు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-11T05:25:45+05:30 IST