తపాలా శాఖను ప్రైవేటీకరించొద్దు

ABN , First Publish Date - 2022-08-11T03:27:35+05:30 IST

తపాలాశాఖను ప్రైవేటీకరించే యోచనను విరమించుకోవాలనినేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ పోస్టల్‌ ఎంప్లాయీస్‌ యూ నియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమాణారెడ్డి అన్నారు.

తపాలా శాఖను ప్రైవేటీకరించొద్దు
మార్కాపురంలో సమ్మె చేస్తున్న పోస్టల్‌ ఉద్యోగులు

మార్కాపురం, ఆగస్టు 10: తపాలాశాఖను ప్రైవేటీకరించే యోచనను విరమించుకోవాలనినేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ పోస్టల్‌ ఎంప్లాయీస్‌ యూ నియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమాణారెడ్డి అన్నారు. తపాలాశాఖ ప్రైవే టీకరణకు వ్యతిరేకంగా మార్కాపురంలో బుధవారం ఒక రోజు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ, కర్షక వ్యతిరేక విధానాలను ప్రభుత్వం విడనాడా లన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అడ్వయిజరీ బోర్డ్‌ సభ్యులు సయ్యద్‌ సుభానీ, డివిజన్‌ గ్రూప్‌ సి కార్యదర్శి  పీజే ప్రవీణ్‌రాజ్‌, పి.ఫోర్‌ కార్యదర్శి ఐ.శంకర్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రఫి,  పోస్టల్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. 

కంభంలో..

బేస్తవారపేట (కంభం) : తపాలాశాఖను ప్రైవేటీకరించవద్దని  బుధవారం పోస్టల్‌ సిబ్బంది సమ్మెకు దిగారు. కంభం హెడ్‌పోస్టాఫీసు లో పోస్టుమాస్టర్‌  వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో ఒక్క రోజు సమ్మె ని ర్వహించారు. వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ బుధవారం దేశవ్యాప్తంగా తపాలాశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్కరోజు సమ్మె జరి గిందన్నారు. తపాలాశాఖ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపడం బాధాకరమన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతా మన్నారు. కార్యక్రమంలో పోస్టల్‌ సిబ్బంది నభిరసూల్‌, విజయ్‌, ప్రభాకర్‌ పాల్గొన్నారు. 

పొదిలిరూరల్‌లో..

పొదిలి రూరల్‌ : తపాలాశాఖను ప్రవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ బుధవారం పొదిలిలో ఎన్‌ఎఫ్‌పీఈ ఆధ్వర్యంలో సిబ్బంది ఒకరోజు సమ్మెను నిర్వహించారు. తపాలా శాఖను నిర్వీర్యం చేసే నిర్ణయాలను ఉపసంహారించుకోవాలని నాయకులు డిమాండ్‌ చే శారు. సమ్మె కారణంగా పొదిలి సబ్‌ డివిజన్‌ పరిధిలోని పలు పో స్టాఫీ సులో కార్యకలాపాలు స్తంభించాయి. కార్యక్రమంలో డివిజన్‌ పి4 ప్రెసి డెంట్‌ ఎం శ్రీనివాసులు, జీడీఎస్‌ ప్రెసిడెంట్‌, రమణయ్య, ఏ వెంకటే శ్వర్లు, ఎస్పీఎం ర విచంద్ర, యానాది, రమేష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-11T03:27:35+05:30 IST