ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించవద్దు

ABN , First Publish Date - 2021-07-28T05:01:25+05:30 IST

ప్రజల ఆస్తిగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం దారుణమని కేంద్ర ప్రభు త్వం అలాంటి నిర్ణయాలకు స్వస్తి పలకాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు పేర్కొన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించవద్దు
తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేస్తున ్న ఏఐటీయూసీ నాయకులు

ప్రొద్దుటూరు టౌన్‌, జూలై 27: ప్రజల ఆస్తిగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం దారుణమని కేంద్ర ప్రభు త్వం అలాంటి నిర్ణయాలకు స్వస్తి పలకాలని  ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు నిరసనగా మంగళవారం ఏఐటీయూ సీ ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లాభాలొచ్చే ప్రభుత్వరంగ సంస్థలను కూడా ప్రైవేటీకరించడానికి చర్యలు తీసుకుందని విమర్శించా రు. విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన కోసం ఆంధ్రులు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఉద్యమించి ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకున్నారన్నారు. ఆ ఫ్యాక్టరీని కూడా ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నించడం దుర్మార్గమన్నారు.  వ్యవసాయ చట్టాలపై నోరు విప్పని బీజేపీ నాయకులు ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్‌ విగ్రహం ఏర్పాటుపై నానా హంగామా చూపిస్తున్నారని మర్శించారు. అనంతరం తహసీల్దారుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు నరసింహ, శ్రీను, యేసోబు, నాగరాజు, యల్లయ్య, గోవిందరెడ్డి, జయమ్మ, నిర్మల, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-28T05:01:25+05:30 IST