ఎలా పాసైందబ్బా!

ABN , First Publish Date - 2020-09-22T05:30:00+05:30 IST

బాలు, దీప ఇద్దరూ మంచి స్నేహితులు. రోజూ బడికి కలిసి వెళ్లే వారు. స్కూల్లో టీచర్లు చెప్పిన పాఠాలు దీప చక్కగా వినేది. ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకునేది. బాలు మాత్రం స్కూల్‌లో అల్లరి చేసేవాడు. పాఠాలు వినకపోయేవాడు...

ఎలా పాసైందబ్బా!

బాలు, దీప ఇద్దరూ మంచి స్నేహితులు. రోజూ బడికి కలిసి వెళ్లే వారు. స్కూల్లో టీచర్లు చెప్పిన పాఠాలు దీప చక్కగా వినేది. ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకునేది. బాలు మాత్రం స్కూల్‌లో అల్లరి చేసేవాడు. పాఠాలు వినకపోయేవాడు. సరిగ్గా చదివేవాడు కాదు. టీచర్లు, తల్లితండ్రులు ‘‘దీపను చూసి బుద్ది తెచ్చుకో!’’ అని ఎప్పుడూ బాలును తిడుతుండేవారు. దాంతో బాలుకి దీప మీద కోపం వచ్చింది. ఎలాగైనా దీపను చదవకుండా చేయాలని, ఆమె పుస్తకాల బ్యాగును బావిలో పడేశాడు. అది తెలియని దీప పుస్తకాలు పోయాయని బాధపడింది. ఇంతలో పరీక్షలు దగ్గర పడ్డాయి.


పరీక్షల్లో దీప క్లాసు ఫస్ట్‌ వచ్చింది. బాలు ఫెయిల్‌ అయ్యాడు. పుస్తకాలు లేకపోయినా దీప ఎలా పాసయిందో బాలుకి అర్థం కాలేదు. అదే విషయాన్ని అడిగితే ‘‘నేను ఏ రోజు పాఠాలు ఆ రోజే చదువుకున్నాను’’ అని సమాధానమిచ్చింది దీప. అప్పుడు బాలుకు తాను చేసిన తప్పు అర్థమైంది. ఆ రోజు నుంచి రోజూ స్కూల్‌కి వెళ్లి శ్రద్ధగా చదువుకోవడం మొదలుపెట్టాడు.

Updated Date - 2020-09-22T05:30:00+05:30 IST