నిరుద్యోగులతో ఆటలాడవద్దు

ABN , First Publish Date - 2021-07-25T04:45:29+05:30 IST

నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవద్దని డీవైఎ్‌ఫఐ, ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు.

నిరుద్యోగులతో ఆటలాడవద్దు

జమ్మలమడుగు రూరల్‌, జూలై 24:నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవద్దని డీవైఎ్‌ఫఐ, ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం జమ్మలమడుగులో  డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి శివకుమార్‌, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కమిటీ సభ్యుడు వినయ్‌కుమార్‌లు మాట్లాడుతూ  నూతన విద్యావిదానం అమలు అయితే రాబోయే అయిదు సంవత్సరాలపాటు ఉపాధ్యాయ ఉద్యోగాలు రావన్నారు. రాష్ట్రంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, నూతన జాబ్‌క్యాలెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి, యువజన సంఘాలను కలుపుకుని నిరుద్యోగులతో భారీ ఉద్యమం నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లాలో నలుగురు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వమే ఇందుకు బాధ్యత వహించి ప్రతి కుటుంబానికి రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

నిరుద్యోగులంటే అంత చులకనా..?

ముద్దనూరు జూలై24: ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ను చూసి ఇక జాబ్‌ రాదని నిరుద్యోగు లు ఆందోళనతో ఉన్నారని  డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్‌ పేర్కొన్నారు. ముద్దనూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిరుద్యోగులు వారి బాధ లు చెప్పుకునేందుకు సీఎం, మంత్రులు, ప్రభుత్వ అధికారుల వద్దకు వెళితే అరెస్టు చేసి, నిర్భందం చేయడం దారుణమన్నా రు. కార్యక్రమంలో ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కమిటీ సభ్యుడు వినయ్‌కుమార్‌, మండల నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T04:45:29+05:30 IST