విద్యుత్‌ కనెక్షన్ల కోసం సిబ్బందికి డబ్బు ఇవ్వొద్దు

ABN , First Publish Date - 2021-06-22T06:47:25+05:30 IST

గ్రామాల్లో వినియోగదారులు, రైతులు విద్యుత్‌ కనెక్షన్ల కోసం విద్యుత్‌ సిబ్బందికి డబ్బులు ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలా ఎ వరు కూడా ఇవ్వొద్దని ఎస్‌ఈ వరకుమార్‌ పేర్కొన్నారు

విద్యుత్‌ కనెక్షన్ల కోసం సిబ్బందికి డబ్బు ఇవ్వొద్దు
వినియోగదారులతో మాట్లాడుతున్న ఎస్‌ఈ వరకుమార్‌


 ఎస్‌ఈ వరకుమార్‌

 డయల్‌ యువర్‌ విద్యుత్‌ ఎస్‌ఈకి 26 ఫిర్యాదులు

అనంతపురంరూరల్‌,జూన్‌21: గ్రామాల్లో వినియోగదారులు, రైతులు విద్యుత్‌ కనెక్షన్ల కోసం విద్యుత్‌ సిబ్బందికి డబ్బులు ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలా ఎ వరు కూడా ఇవ్వొద్దని ఎస్‌ఈ వరకుమార్‌ పేర్కొన్నారు. ఒక వేళ ఇచ్చిన అందుకు సంబంధించిన రసీదు తీసుకోవాలని సూచించారు. సోమవారం వి ద్యుత్‌ శాఖ ప్రధాన కార్యాలయంలో డయల్‌ యువర్‌ ఎస్‌ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా ఎస్‌ ఈ వరకుమార్‌ మరి కొంత మంది అధికారులతో కలిసి రైతులు, వినియోగదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఓడీసీ, నల్లమాడ, గుంతకల్లు, బెళుగుప్ప, పుట్టపర్తి, మడకశిర, తాడిపత్రి టౌన్‌, ధర్మవరం టౌన్‌, వజ్రకరూరు, కదిరి, హిందూపు రం, కూడేరు, తదితర ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. విద్యుత్‌ స్తంభాలు దెబ్బతినడం, రోడ్డు మ ధ్యలో ఉన్న స్తంభాలు తొలగించాలని, వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వాలని, లోఓల్టేజీ తదితర సమస్యలపై ఫిర్యాదు చేశారు. కార్యక్రమాన్ని ప్రా రంభం నుంచి 130 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇందులో 97 ఫిర్యాదులను పరిష్కరించినట్టు తెలిపారు. 


Updated Date - 2021-06-22T06:47:25+05:30 IST