పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు

ABN , First Publish Date - 2022-05-21T03:18:27+05:30 IST

మండల కేంద్రంలోని ఎంపీ డీవో కార్యాలయంలో శుక్రవారం మండల సర్వ సభ్య సమావేశం ఎంపీపీ కుమ్ర తిరుమల అధ్య క్షతన నిర్వహించారు.

పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు
మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు

ఎమ్మెల్యే ఆత్రం సక్కు

జైనూర్‌, మే 20: మండల కేంద్రంలోని ఎంపీ డీవో కార్యాలయంలో శుక్రవారం మండల సర్వ సభ్య సమావేశం ఎంపీపీ కుమ్ర తిరుమల అధ్య క్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మండల సర్వసభ్య సమావేశం వివిధ శాఖల పనితీరును సమీక్షించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలులో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. గ్రామీణ ప్రజలకు తాగునీరు అందించడంలో అధికారులు తగినచర్యలు చేట్టడం లేదన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరి ష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.  కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు, వైస్‌ ఎంపీపీ చిర్లేలక్ష్మన్‌, ఎంపీటీసీలు,సర్పంచ్‌లు అధికా రులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి

గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో గల ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన తనిఖీచేశారు. ఈసందర్భంగా ఆయన ఆస్ప త్రి పరిసరాలను పరిశీలించారు. వైద్యసేవల అమలు తీరును వైద్యాధికారులను అడిగి తెలుసుకు న్నారు. వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్ర మంలో ఎంపీపీ కుమ్రతిరుమల, జిల్లాకోఆప్షన్‌ సభ్యు డు అబుతాలిబ్‌, వైస్‌ఎంపీపీ చిర్లేలక్ష్మన్‌, మార్కెట్‌ కమిటీచైర్మన్‌ ఆత్రం భగవంత్‌ రావు, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-21T03:18:27+05:30 IST