కొవిడ్‌ వైద్యంపై నిర్లక్ష్యం వద్దు

ABN , First Publish Date - 2021-04-21T05:10:51+05:30 IST

కొవిడ్‌ బాధితులకు 24 గంటలూ సేవలందించాలని... ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. జిల్లాలో కొవిడ్‌ పరిస్థితిపై మంగళవారం శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్‌)లో వైద్యులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్‌ సెకెండ్‌వేవ్‌లో వైద్యులు విస్తృత సేవలు అందించి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు.

కొవిడ్‌ వైద్యంపై నిర్లక్ష్యం వద్దు
కొవిడ్‌ పరిస్థితులపై సమీక్షిస్తున్న మంత్రి సీదిరి అప్పలరాజు

 24 గంటలూ సేవలందించాల్సిందే
 మంత్రి సీదిరి అప్పలరాజు
గుజరాతీపేట, ఏప్రిల్‌ 20:
కొవిడ్‌ బాధితులకు 24 గంటలూ సేవలందించాలని... ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. జిల్లాలో కొవిడ్‌ పరిస్థితిపై మంగళవారం శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్‌)లో వైద్యులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్‌ సెకెండ్‌వేవ్‌లో   వైద్యులు విస్తృత సేవలు అందించి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. ‘జిల్లాలో ప్రస్తుతం 1700 కొవిడ్‌ బెడ్లు, 1500 క్వారంటైన్‌ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కూడా వైద్యం అందించాలి.  వైద్యులు, సిబ్బంది పూర్తి సహాయ సహకారాలందించాలి. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలి. మార్కెట్‌కు  గుంపులుగా వెళ్లవద్దు. మాస్కులు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలి.’ అని మంత్రి సూచించారు. కార్యక్రమంలో కొవిడ్‌ ప్రత్యేకాధికారి కాంతిలాల్‌దండే, జేసీ సుమిత్‌కుమార్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-21T05:10:51+05:30 IST