Abn logo
May 23 2020 @ 03:39AM

ఉపాధి పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దు

కేశంపేట: ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దని, చేసిన పనులకు వెంటనే బిల్లులు వచ్చే విధంగా చూడాలని ఎంపీపీ రవీందర్‌యాదవ్‌ అన్నారు. శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ లాక్‌డౌన్‌తో గ్రామాల్లో కూలీలు ఉపాధి పనులపై ఆసక్తి కనబరుస్తున్నరని అన్నారు. గ్రామ పంచాయతీలకు లక్షల్లో వస్తున్న విద్యుత్‌ బిల్లుల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని శాఖ ఏఈ వినోద్‌ తెలిపారు.


తాగునీటికి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారు లు చర్యలు తీసుకో వాలని, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండకపోవడంతో లైన్‌మెన్ల జీతాల చెల్లింపులో జ్యాపం జరుగుతుందని ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ఇన్‌చార్జి ఎంపీడీవో ఎం.గణపతి, షాద్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ వర్కాల లక్ష్మీనారాయణగౌడ్‌, కొత్తపేట పీఏసీఎస్‌ చైర్మన్‌ గండ్ర జదీశ్వర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement