సీఎంపీఎఫ్‌ ఆఫీస్‌ను తరలించవద్దు

ABN , First Publish Date - 2022-08-15T05:37:36+05:30 IST

రామగుండంలో కొనసాగుతున్న సీఎంపీఎఫ్‌ కార్యాలయాన్ని హైదరాబాద్‌కు తరలించవద్దని టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఏఐటీయూ సీ ప్రధానకార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, బీఎంఎస్‌ అధ్య క్షుడు యాదగిరి సత్తయ్య, సీఐటీయూ అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, ఐఎన్‌టీయూసీ నాయకులు కచ్చకాయల సదానం దం హెచ్చరించారు.

సీఎంపీఎఫ్‌ ఆఫీస్‌ను తరలించవద్దు
సమావేశంలో పాల్గొన్న కార్మిక సంఘాల నాయకులు

- కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రికి లేఖ రాసిన సంఘాలు

గోదావరిఖని, ఆగస్టు 14: రామగుండంలో కొనసాగుతున్న సీఎంపీఎఫ్‌ కార్యాలయాన్ని హైదరాబాద్‌కు తరలించవద్దని టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఏఐటీయూ సీ ప్రధానకార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, బీఎంఎస్‌ అధ్య క్షుడు యాదగిరి సత్తయ్య, సీఐటీయూ అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, ఐఎన్‌టీయూసీ నాయకులు కచ్చకాయల సదానం దం హెచ్చరించారు. ఆదివారం గోదావరిఖనిలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కార్మికులు అనేక పోరా టాలు చేసి సాధించుకున్న సీఎంపీఎఫ్‌ కార్యాలయాన్ని 2007 లో అప్పటి ఎంపీ చెలిమెల సుగుణకుమారి చొరవతో ఐబీ కాలనీలో నూతన క్వార్టర్లు నిర్మించి అందులో కారాలయాన్ని ఏర్పాటు చేశారని, ఈ కార్యాలయం ద్వారా 33వేల మంది ఉద్యోగులు లబ్ధి పొందు తున్నారని, రామగుండం, శ్రీరాంపూర్‌, బెల్లంపల్లి, గోలేటి, మందమర్రి, భూపాలపల్లి ఏరియాలకు చెందిన ఉద్యోగులు టర్మినల్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌ స్కీమ్‌, పెన్షన్‌ సవరణ, హౌసింగ్‌లోన్‌, మ్యారేజ్‌ లోన్‌తో పాటు అనేక సేవలు ఇక్కడే పొందుతున్నారని, అలాంటిది ఇప్పుడు సిబ్బంది ఇక్కడి నుంచి వెళ్లిపోతామంటూ, కార్యాలయాన్ని హైదరాబాద్‌ కు తరలించాలని గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారని, దీనిని వ్యతిరేకిస్తున్నామని కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. గతంలో పెన్షన్‌కు సంబంధించి ఏ సమస్య వచ్చినా హైదరాబాద్‌కు వెళ్లేవారని, రామగుండంలో సిబ్బంది కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసినప్పటికీ ఇక్కడ సిబ్బంది ఉండకుం డా మొండిగా వ్యవహరిస్తున్నారన్నారు. సీఎంపీఎఫ్‌ కార్యాలయాన్ని హైదరాబాద్‌ తరలించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ఈనెల 16న జరుగనున్న ట్రస్ట్‌ బోర్డులో కూడా స్పష్టంగా చెబుతామని, కార్యాల యాన్ని తరలిస్తే ఊరుకోమని, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, కోల్‌ సెక్రటరీకి లేఖ కూడా రాసినట్టు చెప్పారు. 

Updated Date - 2022-08-15T05:37:36+05:30 IST