టెన్త్‌ మార్కుల మెమోలో గ్రేడ్లు, మార్కులు ఇవ్వొద్దు

ABN , First Publish Date - 2020-07-09T09:22:04+05:30 IST

పదో తరగతి మార్కుల మెమోలో గ్రేడ్లు, మార్కులు ఇవ్వొద్దని విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ ప్రతినిధులు బుధవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌

టెన్త్‌ మార్కుల మెమోలో గ్రేడ్లు, మార్కులు ఇవ్వొద్దు

పాఠశాల విద్య కమిషనర్‌కు విద్యార్థి సంఘాల వినతి 


విజయవాడ, జూలై 8 (ఆంధ్రజ్యోతి) : పదో తరగతి మార్కుల మెమోలో గ్రేడ్లు, మార్కులు ఇవ్వొద్దని విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ ప్రతినిధులు బుధవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చిన వీరభద్రుడిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కరోనా తీవ్రత దృష్ట్యా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను రద్దు చేసి విద్యార్థులందరినీ  ఉత్తీర్ణులుగా ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.


2019-20 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని రద్దుచేసిన దృష్ట్యా చాలావరకు ప్రైవేట్‌ కార్పొరేషన్‌ విద్యాసంస్థలు తమ సీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో ఇష్టానుసారంగా 10/10 జీపీఏ లక్ష్యంగా మార్కులు ఎంట్రీ చేశాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే కచ్చితత్వాన్ని పాటించి విద్యార్థుల మార్కులను నమోదు చేయగా, ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యార్థులకు అత్యధిక మార్కులు వచ్చే ఆస్కారం ఉందని, దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పారు. 


Updated Date - 2020-07-09T09:22:04+05:30 IST