ఆ నోటిఫికేషన్‌ను అమలు చేయొద్దు

ABN , First Publish Date - 2022-05-20T09:54:34+05:30 IST

ప్రైవేట్‌ రవాణా వాహనాల రిజిస్ట్రేషన్‌ రుసుం పెంచుతూ కేంద్రం విడుదల చేసిన 714(ఈ) నోటిఫికేషన్‌ను తెలంగాణలో అమలు చేయొద్దని, లేని పక్షంలో వేలాది మంది రవాణా కార్మికులతో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని తెలంగాణ రాష్ట్ర ఆటో, క్యాబ్‌, లారీ డ్రైవర్లు, ఓనర్ల సంఘాల జేఏసీ ప్రతినిధులు హెచ్చరించారు.

ఆ నోటిఫికేషన్‌ను అమలు చేయొద్దు

  • లేదంటే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం
  • ఆటో, క్యాబ్‌, లారీ డ్రైవర్లు, 
  • ఓనర్ల సంఘాల జేఏసీ హెచ్చరిక


చిక్కడపల్లి/హైదరాబాద్‌, మే19 (ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ రవాణా వాహనాల రిజిస్ట్రేషన్‌ రుసుం పెంచుతూ కేంద్రం విడుదల చేసిన 714(ఈ) నోటిఫికేషన్‌ను తెలంగాణలో అమలు చేయొద్దని, లేని పక్షంలో వేలాది మంది రవాణా కార్మికులతో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని తెలంగాణ రాష్ట్ర ఆటో, క్యాబ్‌, లారీ డ్రైవర్లు, ఓనర్ల సంఘాల జేఏసీ ప్రతినిధులు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, క్యాబ్‌, లారీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం బంద్‌ పాటించి భారీ ప్రదర్శనలు నిర్వహించారు. హైదరాబాద్‌లో ట్రాన్స్‌పోర్టు భవన్‌ ముట్టడికి వందలాది మంది తరలి వచ్చారు. అంతకుముందు జేఏసీ కన్వీనర్‌ బి.వెంకటేశం మాట్లాడుతూ వాహనాల రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచడమే కాకుండా, ఫిటెనెస్‌ లేని వాహనాలకు రోజుకు రూ.50 చొప్పున జరిమానా వసూలు చేస్తామనడం దారుణమన్నారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర ఆటో, టాక్సీ డ్రైవర్స్‌ యూనియన్‌(బీఎంఎ్‌స) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. 

Updated Date - 2022-05-20T09:54:34+05:30 IST