అపచారం... అపచారం... చాయ్‌లో ఇడ్లీ ముంచి తినొద్దు!

ABN , First Publish Date - 2020-02-19T14:18:03+05:30 IST

సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఒక వ్యక్తి చాయ్‌లో ఇడ్లీ ముంచుకుని తింటూ, ఆ వీడియోలో కనిపిస్తున్నాడు. సాధారణంగా చాలామంది తాము తినే ఆహారంపై ప్రయోగాలు చేస్తుంటారు.

అపచారం... అపచారం... చాయ్‌లో ఇడ్లీ ముంచి తినొద్దు!

సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఒక వ్యక్తి చాయ్‌లో ఇడ్లీ ముంచుకుని తింటూ, ఆ వీడియోలో కనిపిస్తున్నాడు. సాధారణంగా చాలామంది తాము తినే ఆహారంపై ప్రయోగాలు చేస్తుంటారు. అయితే కొంతమందికి ఈ వ్యక్తి చాయ్‌లో ఇడ్లీ ముంచుకుని తినడం ఎంతమాత్రం నచ్చలేదు. దీంతో సోషల్ మీడియాలో అతనిని దుమ్మెత్తిపోస్తున్నారు. ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేస్తూ ‘హలో, నేను భారత్‌కు కొత్త. ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో అది సరైనదేనని అనుకుంటున్నాను‘ అని రాశాడు. దీనిని చూసిన కొంతమంది నెటిజన్లు దీనిని పాపకార్యంగా భావిస్తూ వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. కాగా గతంలో ఒక వ్యక్తి పాలతో మ్యాగీ తయారు చేసి, ఆ వీడియోను పోస్టు చేశాడు. అప్పట్లో ఇది వైరల్‌గా మారింది. 




Updated Date - 2020-02-19T14:18:03+05:30 IST