Jio 5G: జియో 5జీ కోసం వెయిటింగా ?.. ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి..

ABN , First Publish Date - 2022-10-07T22:02:14+05:30 IST

దసరా సందర్భంగా జియో 5జీ (Jio 5G) సర్వీసులు ఆరంభమయ్యాయి. అయితే ప్రస్తుతం ఎంపిక చేసిన నాలుగు నగరాల్లో ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే సేవలు అందుబాటులోకి వచ్చాయి.

Jio 5G: జియో 5జీ కోసం వెయిటింగా ?.. ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి..

సరా సందర్భంగా జియో 5జీ (Jio 5G) సర్వీసులు ఆరంభమయ్యాయి. అయితే ప్రస్తుతం ఎంపిక చేసిన కొన్ని నగరాల్లో ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే సేవలు అందుబాటులోకి వచ్చాయి. రానున్న నెలల వ్యవధిలోనే మరిన్ని నగరాల్లో 5జీ సేవలు షురూ కాబోతున్నాయి. ఇక 2023 చివరి నాటికి దేశవ్యాప్తంగా  సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే 4జీ కంటే కొన్ని రెట్లు ఎక్కువ స్పీడ్‌తో పనిచేసే 5జీ సేవల  కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాక నిరంతరాయ సేవలు పొందాలనుకుంటే మూడు అంశాలు చాలా ముఖ్యం. అవేంటో మీరూ చూసేయండి..


5జీ స్మార్ట్‌ఫోన్ ఉండాలి..

జియో లేదా ఎయిర్‌టెల్ 5జీ సర్వీసు ఏదైనా సరే 5జీ స్మార్ట్‌ఫోన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ సేవలు అందుతాయి. కాబట్టి 5జీ స్మార్ట్‌ఫోన్లు ఉన్న యూజర్లు మాత్రమే 5జీ సర్వీసులు పొందుతారు. 5జీ ఫోన్ ఉన్నంత మాత్రన సరిపోదు. దానికి అవసరమైన అప్‌డేట్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కనుక 3జీ లేదా 4జీ ఫోన్‌ను ఉపయోగిస్తుంటే 5జీ ఫోన్‌కు మారిపోతే నిరంతరాయంగా 5జీ సేవలు పొందొచ్చు.


సరైన జియో ప్లాన్‌ను ఎంచుకోవాలి..

రూ.239 పైబడిన ప్లాన్స్‌పై మాత్రమే జియో 5జీ సర్వీసు లభిస్తాయని ‘టెలికంవాల్క్’ వెబ్‌సైట్ రిపోర్ట్ పేర్కొంది. అయితే రిచార్జ్ ప్లాన్స్‌కు సంబంధించిన వివరాలను జియో అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే జియో 5జీ సర్వీసులు పొందాలంటే రూ.239 కంటే ఎక్కువ మొత్తం రిఛార్జులు చేసుకోవాల్సి ఉంటుందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.


త్వరలోనే అన్ని ప్రాంతాలకు..

ప్రస్తుతానికి దేశంలో 4 నగరాల్లో మాత్రమే జియో 5జీ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.  ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, వారాణసీ నగరాల్లో మాత్రమే వినియోగంలోకి వచ్చాయి. ఒకవేళ వేరే పట్టణాలు లేదా నగరాల్లో ఉండి ఉంటే కొన్ని వారాలు లేదా నెలల వ్యవధిలోనే 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. వెల్‌కమ్ ఆఫర్‌లో 1 జీబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ 5జీ డేటాను అందిస్తోంది. 5జీకి సంబంధించి కొత్త ప్లాన్స్ వచ్చేవరకు 4జీ ప్లాన్స్ స్థాయిలోనే ప్లాన్స్ ధరలు ఉండే అవకాశం ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Updated Date - 2022-10-07T22:02:14+05:30 IST