Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏళ్లతరబడి తిరుగున్నా పనులు చేయరు..


నాగులుప్పలపాడు(ఒంగోలురూరల్‌) , డిసెంబరు 6 : : మండల తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేటట్లుగా తిరిగినా పనులు జరగటంలేదని మండల కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఆరోపిస్తున్నారు. నాగులుప్పలపాడు తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆంధ్రజ్యోతి సోమవారం విజిట్‌ చేసింది. ఈసందర్భంగా పలువురు రైతులు, వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలు  అధికారుల కోసం ఎదురుచూడటం కనిపించింది. పట్టాదారు పాసు పుస్తకాలకు, భూములు ఆన్‌లైన్‌కు అర్జీలు పెట్టుకుని  సంవత్సరాల తరబడి తిరుగుతున్నా పనులు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 

భూముల ఆన్‌లైన్‌ కోసం తిరుగుతున్నా

తుపాకుల లక్ష్మీనారాయణ, కనపర్తి రైతు

కనపరి గ్రామంలో పలు సర్వే నంబర్లలో నాకు భూమి ఉంది. ఆ భూములు ఆన్‌లైన్‌ చేయనందున అమ్ముకోవటానికి వీలు పడటంలేదు.  70 సంవత్సరాల వయసులో  ఈ పని కోసం 7నెలలు నుంచి తిరుగుతున్నాను.  పట్టించుకునే వారు లేదు. నా భూములు ఆన్‌లైన్‌ చేసి పట్టాదారుపాసుపుస్తకం ఇప్పించాలని కోరుతున్నా.  

Advertisement
Advertisement