chanakya niti: ఈ మూడు విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తే ప్రాణహాని ఖాయం!

ABN , First Publish Date - 2022-09-27T13:05:55+05:30 IST

ఆచార్య చాణక్యుడు మతం, రాజకీయాలు, సామాజిక శాస్త్రం...

chanakya niti: ఈ మూడు విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తే ప్రాణహాని ఖాయం!

ఆచార్య చాణక్యుడు మతం, రాజకీయాలు, సామాజిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రాలలో గొప్ప పండితునిగా పేరు గడించాడు. అతని తెలివితేటలు, సామర్థ్యం భారతదేశ చరిత్రను మార్చివేశాయి. చాణక్య అందించిన జీవన విధానాలు లక్ష్యాలను సాధించడానికి మనకు ప్రేరణ కల్పిస్తాయి. జీవితంలో విజయం సాధించడానికి సహాయపడతాయి. ఎవరైనాసరే చాణక్యుడు చెప్పిన జీవన విధానాలను దృష్టిలో ఉంచుకుని, వాటిని జీవితంలో అమలు చేస్తే, అనేక సమస్యలను నివారించుకోవచ్చు. ఆచార్య చాణక్యుడు తన విధానాలలో స్నేహితులను, శత్రువులను గుర్తించడానికి, పరీక్షించడానికి అనేక మార్గాలను అందించాడు. అలాగే మూడు విషయాలలో ఎప్పుడూ నిర్లక్ష్యం వహించకూడదని చాణక్యుడు తెలిపాడు. దీనికి భిన్నంగా ప్రవర్తిస్తే ప్రాణహాని ఏర్పడుతుందని హెచ్చరించాడు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


పరిపాలకులు

రాజుతో లేదా పరిపాలకులతో ఎప్పుడూ శత్రుత్వం వహించకూడదని చాణక్యుడు చెప్పాడు. ఎవరైనా ఇలా నడుచుకుంటే వారికి దుఃఖం, కష్టం తప్ప మరేమీ మిగలదని తెలిపాడు. మీరు కార్యాలయంలో పని చేస్తున్నట్లయితే లేదా రాజకుటుంబంలో పని చేస్తున్నా, పరిపాలకుల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోకండి. పరిపాలకులతో శత్రుత్వం పెట్టుకుంటే ప్రాణ, ఆస్తి నష్టం జరగవచ్చని ఆచార్య చాణక్య సూచించారు. 

బలమైన వ్యక్తితో శత్రుత్వం

మనకన్నా బలం కలిగిన వ్యక్తితోనూ శత్రుత్వం పెట్టుకోకూడదని ఆచార్య చాణక్య తెలిపారు. బలమైన వ్యక్తి తన గొప్పను నిరూపించుకునేందుకు ఎవరినైనా ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ప్రయత్నిస్తాడు. ఇతరులకు హాని చేసేందుకు వెనుకాడడు. అందుకే అలాంటివారితో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకూడదు.

ఆరోగ్యంపై నిర్లక్ష్యం

మనిషి తన ఆరోగ్యం గురించి ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. తన ఆరోగ్యంతో తానే ఆటలాడుకునే వ్యక్తి ఆపదల్లో చిక్కుకుంటాడు. అందుకే మనిషి ఆహార పానీయాల విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదని ఆచార్య చాణక్య తెలిపారు. 



Updated Date - 2022-09-27T13:05:55+05:30 IST