వసతుల కల్పనలో రాజీ పడొద్దు

ABN , First Publish Date - 2021-10-27T05:44:12+05:30 IST

సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు వసతుల కల్పనలో రాజీ పడొద్దని జాయింట్‌ కలెక్టర్‌(సంక్షేమం) రాజశేఖర్‌ సూచించారు. మంగళవారం రాత్రి మదనపల్లె పట్టణంలోని ప్రభుత్వ బాలికలు, ఇంటిగ్రేటెడ్‌ గిరిజన బాలుర వసతి గృహాలను జేసీ తనిఖీ చేశారు.

వసతుల కల్పనలో రాజీ పడొద్దు
సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో జేసీ రాజశేఖర్‌

సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసిన జేసీ


మదనపల్లె టౌన్‌, అక్టోబరు 26: సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు వసతుల కల్పనలో రాజీ పడొద్దని జాయింట్‌ కలెక్టర్‌(సంక్షేమం) రాజశేఖర్‌ సూచించారు. మంగళవారం రాత్రి మదనపల్లె పట్టణంలోని ప్రభుత్వ బాలికలు, ఇంటిగ్రేటెడ్‌ గిరిజన బాలుర వసతి గృహాలను జేసీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, వీటిని అమలు చేయాల్సిన బాధ్యత హాస్టల్‌ వార్డెన్లదే అన్నారు. అనంతరం విద్యార్థులకు అందుతున్న మెనూ, కాస్మెటిక్‌ చార్జీలు గురించి వాకబు చేశారు. పాఠ్యాంశాల్లోని పలు అంశాలపై విద్యార్థుల ప్రతిభను ఆరా తీశారు. పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళ హాస్టల్లో ప్రత్యేకంగా ట్యూషన్స్‌ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. అనంతరం విద్యార్థుల మంచాలు, ఫర్నిచర్‌ తనిఖీ చేశారు.

Updated Date - 2021-10-27T05:44:12+05:30 IST