Abn logo
Mar 26 2020 @ 22:30PM

‘ఈ శుక్రవారం మక్కా మసీదులో ప్రార్థనలకు ముస్లింలు రావద్దు’

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా మక్కా మసీదులో ఈ శుక్రవారం ప్రార్థనలకు ముస్లింలు రావొద్దని మక్కా సూపరింటెండెంట్ మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ సిద్ధిఖీ సూచించారు. కరోనా నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 45కు చేరాయి. గురువారం ఒక్కరోజే 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సికింద్రాబాద్‌‌లోని బౌద్ధనగర్‌లో 45 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌‌గా వైద్యులు తేల్చారు.

Advertisement
Advertisement
Advertisement