కందుకూరు డివిజన్‌ను రద్దుచేయొద్దు!

ABN , First Publish Date - 2022-01-28T05:20:43+05:30 IST

చారిత్రక నేవథ్యం కలిగి రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌గా గుర్తింపు పొందిన కందుకూరు డివిజన్‌ని రద్దు చేయవద్దని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి బుధ వారం రాత్రే లేఖ పంపించినట్టు ఎమ్మెల్యే మానుగుంట మహీధర రెడ్డి తెలిపారు.

కందుకూరు డివిజన్‌ను రద్దుచేయొద్దు!
ఎమ్మెల్యే మహీధరరెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న జర్నలిస్టులు

 సీఎంకు లేఖ రాసిన ఎమ్మెల్యే మహీధరరెడ్డి 

కందుకూరు, జనవరి 27: చారిత్రక నేవథ్యం కలిగి రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌గా గుర్తింపు పొందిన కందుకూరు డివిజన్‌ని రద్దు చేయవద్దని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి బుధ వారం రాత్రే లేఖ పంపించినట్టు ఎమ్మెల్యే మానుగుంట మహీధర రెడ్డి తెలిపారు. డివిజన్‌ని రద్దు చేయవద్దని కోరుతూ కందుకూరులోని జర్నలిస్టులు గురువారం సబ్‌కలెక్టర్‌ అపరాజిత సింగ్‌ సిన్సిన్వార్‌, ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డిలను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై సబ్‌కలెక్టర్‌ స్పందిస్తూ మీ విజ్ఞాపనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతా నని చెప్పారు. కందుకూరు రెవిన్యూ డివిజన్‌గా కొనసాగేలా తనవం తు ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మహీధర్‌రెడ్డి విలేకరులతో ఆయన మాట్లాడారు. కందుకూరు డివిజన్‌కి ఉన్న చరిత్ర, అది రద్దయితే ఈ ప్రాంతానికి జ రిగే నష్టాన్ని సమగ్రంగా వివరిస్తూ  ముఖ్యమంత్రికి మెయిల్‌ ద్వారా లేఖ పంపించినట్టు చెప్పారు. త్వరలోనే ఆయనను వ్యక్తిగతంగా కూ డా కలిసి కందుకూరు డివిజన్‌ని కొనసాగించాల్సిన అవసరాలను వివరిస్తానని తెలిపారు. కందుకూరుని ప్రకాశం జిల్లాలోనే కొనసాగిం చాలని కూడా డిమాండ్‌ చేయరా అని ప్రశ్నించగా ఆయన నేరుగా సమాధానం ఇవ్వలేదు. జిల్లాల పునర్విభజనకు నోటిఫికేషన్‌ మాత్రమే కదా ఇచ్చారు, ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి అభ్యంతరాలు స్వీకరించాకే విధాన నిర్ణయం ఉంటుందని ఆ అభిప్రాయ సేకరణలో ను నా అభిప్రాయాన్ని జిల్లా కలెక్టరుకి కూడా తెలియజేస్తానన్నారు. పరిపాలనా సౌలభ్యం, అభివృద్ధి పేరుతో ప్రకాశం జిల్లా ఏర్పడ్డాక కూడా జిల్లా కేంద్రానికి సుదూరంగా ఉన్న గిద్దలూరు, ఎర్రగొండపా లెం మార్కాపురం వాసులు ఇబ్బంది పడలేదా అని ఆయన ప్రశ్నిం చారు.  వారి కష్టాలు ఇప్పుడూ తీరటం లేదు కదా, మార్కాపురం జి ల్లాగా ఏర్పాటుచేసి కందుకూరుని ప్రకాశం జిల్లాలోనే కొనసాగిస్తే అం దరికి పరిపాలనా సౌలభ్యం ఏర్పడుతుంది కదా అని విలేకరులు ప్ర శ్నించగా ఇటువంటి అర్థవంతమైన సూచనలు చేస్తే అందరికీ ఉప యోగం ఉంటుంది కాని, అర్థంలేని విమర్శలతో ఒరిగేది ఏమిటని మ హీధరరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే నెల్లూరులో కలిసినా ప్రకాశంలో నే కొనసాగినా రామాయపట్నం పోర్టు నిర్మాణంకు వచ్చే ఇబ్బంది ఏమీ ఉండబోదని ఆయన వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-01-28T05:20:43+05:30 IST