కరోనా కట్టడికి ముందస్తు చర్యలు

ABN , First Publish Date - 2020-03-29T10:42:18+05:30 IST

కరోనా వైర్‌స వ్యాప్తి చెందకుండా రాష్ట్రంలో ముందస్తు చర్యలు తీసుకు న్నామని రాష్ట్ర విద్యుత్‌, అటవీ, పర్యావరణల

కరోనా కట్టడికి ముందస్తు చర్యలు

 జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించొద్దు

పంటల రక్షణకు చర్యలు తీసుకోవాలి

మంత్రి బాలినేని ఆదేశం


ఒంగోలు(కలెక్టరేట్‌), మార్చి 28 : కరోనా వైర్‌స వ్యాప్తి చెందకుండా రాష్ట్రంలో ముందస్తు చర్యలు తీసుకు న్నామని రాష్ట్ర విద్యుత్‌, అటవీ, పర్యావరణల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన భవన్‌లో శనివారం జిల్లా అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే కరోనా వైర్‌సను నియంత్రించడంలో మనమే ముందున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ముందుచూపుతో వ్యవహ రించడం వల్లనే ఇది సాధ్యమైందని తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌, ఎస్పీ, ఇతర అధికారులు, సిబ్బంది సత్వర చర్యలు తీసుకోవడంతో పాటు జర్నలిస్టులు ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారానే సాధ్యమైందని తెలిపారు. జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్‌ను మంత్రి అదేశించారు.


విధి నిర్వహణలో భాగంగా కరోనా వైరస్‌ నియంత్రణ కోసం పనిచేస్తున్న జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు కూడా మంత్రి సూచించారు. వచ్చేనెల 14వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ఉన్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిత్యావసరాలు, కూరగాయలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రస్తుతం భూముల్లో కోత దశలో ఉన్న పంటలు దెబ్బతినకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి బాలినేని ఆదేశించారు. 


ఎమ్మెల్యే నిధుల  నుంచి రూ. 65 లక్షలు  

  కరోనా వైర స్‌ నియంత్రణకు ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 65 లక్షలు కేటాయిస్తున్నట్లు మంత్రి బాలినేని సమావేశంలో ప్రకటించారు. ఈ నిధులను కరోనా వైరస్‌ నియంత్రణకు వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. అలాగే ఒంగోలులోని నారాయణ స్కూలు ప్రతినిధులు అక్రమంగా అడ్మిషన్లు చేసుకుంటుంటే ఏమి చేస్తున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఇటువంటి ప్రక్రియలకు పాల్పడితే స్కూలు అనుమతులను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి వీఎస్‌ సుబ్బారావును ఆదేశించారు.


అంతకు ముందు జిల్లాలో కరోనా వైరస్‌ నియంత్రణ కోసం  చేపట్టిన కార్యక్రమాలను కలెక్టర్‌ పోలా భాస్కర్‌ వివరించారు.  అలాగే ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు డోర్‌ డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు చేశామని జేసీ షన్మోహన్‌ వివరించారు. సమా వేశంలో జాయింట్‌ కలెక్టర్‌-2 నరేంద్ర ప్రసాద్‌, డీఆర్వో వెంకట సుబ్బయ్య, ఏఎస్పీ శరత్‌బాబు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ పద్మావతితో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-03-29T10:42:18+05:30 IST