పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వద్దు

ABN , First Publish Date - 2021-07-31T05:52:36+05:30 IST

పల్లె ప్రగతిలో భాగంగా చేయాల్సిన పనులను వెంటనే పూర్తిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అడిషనల్‌ కలెక్టర్‌ చిత్రామిశ్రా హెచ్చరించారు. శుక్రవారం రూరల్‌ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. మల్కపూర్‌ తండా, గాంధీనగర్‌, కొత్తపేట గ్రామాల్లో,

పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వద్దు
అధికారులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా

- పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలి
- రూరల్‌ మండలంలో పర్యటించిన అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా

నిజామాబాద్‌ రూరల్‌, జూలై 30: పల్లె ప్రగతిలో భాగంగా చేయాల్సిన పనులను వెంటనే పూర్తిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అడిషనల్‌ కలెక్టర్‌ చిత్రామిశ్రా హెచ్చరించారు. శుక్రవారం రూరల్‌ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. మల్కపూర్‌ తండా, గాంధీనగర్‌, కొత్తపేట గ్రామాల్లో, ముత్తకుంట, తదితర గ్రామాల్లో జరుగుతున్న పల్లె ప్రగతి పనులు పరిశీలించారు. కొన్ని గ్రామాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్‌ పనులు అసంపూర్తిగా ఉండటం చూసి అసహనం వ్యక్తం చేశారు. పను ల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. అన్ని గ్రామాల్లోనూ పనులు పూర్తిస్థాయిలో చేయించాలని, చూసీచూడనట్లు వ్యవహరించవద్దని ఎంపీడీవో మల్లేష్‌ను మందలించారు. పనులను వేగవంతంగా పూర్తిచేయించాలని, మిగిలిలన పనులు రెండు రోజుల్లో పూర్తిచేయాలని ఎంపీడీవోకు సూచించారు. జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచనల మేరకు ప్రతీ గ్రామంలో ఎవెన్యూ ప్లాంటేషన్‌ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. కలెక్టర్‌ పర్యటనలో సర్పంచ్‌ కెతావత్‌ హరిచంద్‌ నాయక్‌, ఎంపీపీ అనూష, ఎంపీడీవో మల్లేష్‌, ఏపీవో పద్మ, పంచాయతీ కార్యదర్శి సంతోష్‌, ఈజీఎస్‌ సిబ్బంది, తదితరులున్నారు.

Updated Date - 2021-07-31T05:52:36+05:30 IST