అధైర్యపడొద్దు.. నేనున్నా!

ABN , First Publish Date - 2021-11-26T05:26:28+05:30 IST

అధైర్యపడొద్దు.. నేనున్నా!

అధైర్యపడొద్దు.. నేనున్నా!
ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌ స్పందన

  • శిశువుకు వైద్యం విషయమై తల్లిదండ్రులకు కేటీఆర్‌ అభయం
  • ట్విటర్‌ వేదికగా స్పందించిన మంత్రి

బంట్వారం: ‘అధైర్య పడొద్దు.. మీకు అండగా నేనున్నా’ అంటూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా శిశువు తల్లిదండ్రులకు అభయం ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. బంట్వారం మండలం తోర్మామిడికి చెందిన రమేష్‌ దంపతులకు ఈ నెల 20న కొ డుకు పుట్టాడు. శిశువుకు హృదయ సంబంధ సమస్య తలెత్తింది. దీంతో రమేష్‌ తన స్నేహితుడు తెలంగాణ సెక్యూల ర్‌ ఫోరం వ్యవస్థాపకుడు జహీర్‌పాషాను సంప్రదించాడు. శిశువుకు వైద్యం అందజేసి ఆదుకోవాలని శిశువు ఫొటోపెట్టి ట్విట్టర్‌లో జహీర్‌పాషా మ ంత్రి కేటీఆర్‌, నటుడు సోనూసూద్‌ల ను కోరాడు. దీనికి కేటీఆర్‌ ‘మీరు ధైర్యంగా ఉండండి. బాబు కు మెరుగైన వైద్యం చేయిస్తాం.’ అని హామీ ఇ చ్చారు. స్పందించిన మంత్రి కేటీఆర్‌, జహీర్‌పాషాలకు రమేష్‌ ధన్యవాదాలు తెలిపాడు.

Updated Date - 2021-11-26T05:26:28+05:30 IST