వైసీపీ బెదిరింపులకు భయపడొద్దు!

ABN , First Publish Date - 2021-02-27T05:17:13+05:30 IST

వైసీపీ నాయకుల బెదిరింపులకు ఎవరూ భయపడ వద్దని... మునిసిపల్‌ ఎన్నికల్లో సైనికుల్లా పని చేయాలని టీడీపీ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పలాసలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం పలాస-కాశీబుగ్గ మునిసిపల్‌ కౌన్సిలర్‌ అభ్యర్థులతో ముఖాముఖి నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ధనం, ప్రలోభాలు, భయబ్రాంతులకు గురిచేసి వైసీపీ గెలుపొందాలని చూస్తోందన్నారు. దీన్ని కార్యకర్తలు ధైర్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

వైసీపీ బెదిరింపులకు భయపడొద్దు!
మాట్లాడుతున్న కూన రవికుమార్‌..

‘పుర’పోరులో సైనికులుగా పనిచేయాలి

 మేము అండగా ఉంటాం

 అన్ని చోట్లా మనదే విజయం

 టీడీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్‌

పలాస, ఫిబ్రవరి 26: వైసీపీ నాయకుల బెదిరింపులకు ఎవరూ భయపడ వద్దని... మునిసిపల్‌ ఎన్నికల్లో సైనికుల్లా పని చేయాలని టీడీపీ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పలాసలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం పలాస-కాశీబుగ్గ మునిసిపల్‌ కౌన్సిలర్‌ అభ్యర్థులతో ముఖాముఖి  నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ధనం, ప్రలోభాలు, భయబ్రాంతులకు గురిచేసి వైసీపీ గెలుపొందాలని చూస్తోందన్నారు. దీన్ని కార్యకర్తలు ధైర్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ‘కొన్ని వార్డుల అభ్యర్థులకు వైసీపీ నేతలు నేరుగా బెదిరిస్తున్నారు. వ్యాపారాలు సాగనీయబోమని హెచ్చరిస్తున్నారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నాతో పాటు ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఎన్నికలు జరిగే వరకూ ఇక్కడే ఉంటాం. ఏ కార్యకర్తకు.. నాయకుడికి అన్యాయం జరిగినా, మేము ముందు ఉంటాం. ప్రచారం నుంచి ఓటింగ్‌ జరిగే వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లోనూ మనమే  విజయం సాధిస్తాం. ప్రజలు కూడా నిష్పక్షపాతంగా ఓటు వేయాలి’ అని రవికుమార్‌ కోరారు. 


 టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థి కనిపించడం లేదు


పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం 8వ వార్డు టీడీపీ అభ్యర్థి రోణంకి మురళీకృష్ణ కనిపించడం లేదని కూన రవికుమార్‌ అన్నారు. మురళీకృష్ణ కిడ్నాప్‌కు గురైనట్లు అతని కుటుంబ సభ్యులు తనకు చెప్పారన్నారు. దీనిపై కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌, టీడీపీ చైర్మన్‌ అభ్యర్థి వజ్జ బాబూరావు, బోయిన గోవిందరావు, పట్టణ అధ్యక్షుడు లొడగల కామేశ్వరరావుయాదవ్‌, పీరుకట్ల విఠల్‌రావు, గాలి కృష్ణారావు, గురిటి సూర్యనారాయణ, మల్లా శ్రీనివాస్‌,  కార్యదర్శి బడ్డ నాగరాజు, మల్లా కృష్ణారావు, హనుమంతు మురళీమోహన్‌, లక్ష్మణ్‌, గోళ్ల చంద్రరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T05:17:13+05:30 IST