వ్యాక్సిన్‌పై ఎలాంటి భయం వద్దు

ABN , First Publish Date - 2021-06-13T05:06:53+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ పట్ల ఎ లాంటి అపోహలు, భయం పెట్టుకోవద్దని జిల్లా వైద్య ఆరో గ్య శాఖాధికారి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ సూచించారు.

వ్యాక్సిన్‌పై ఎలాంటి భయం వద్దు
జమ్మలమడుగు ఆరోగ్య కేంద్రం వైద్యులతో మాట్లాడుతున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ అనిల్‌కుమార్‌

జమ్మలమడుగు రూరల్‌, జూన్‌ 12:  కొవిడ్‌ వ్యాక్సిన్‌ పట్ల ఎ లాంటి అపోహలు, భయం పెట్టుకోవద్దని జిల్లా వైద్య ఆరో గ్య శాఖాధికారి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ సూచించారు. శనివారం జమ్మలమడుగు నియోకవర్గంలోని వద్దిరాల, పెద్దముడియం, మోరగుడి, మైలవరం ఆరోగ్య కేంద్రాలను ఆయన తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని తెలిపారు. కొవిడ్‌ మూడవ దశ రాబోతున్న నేపథ్యంలో అయిదు సంవత్సరాలలోపు పిల్లలు, తల్లులకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ కార్యక్రమం త్వరలో వస్తుందన్నారు. ప్రతి తల్లి తప్పక వేయించుకోవాలని ఆయన తెలిపారు. అయిదు సంవత్సరాలలోపు పిల్లలపైన ప్రభా వం చూపుతుందని అప్పుడు తల్లి సురక్షితంగా ఉండాలంటే కొవిడ్‌ టీకా రక్షిస్తుందని ఆయన అన్నారు. వృద్ధాశ్రమాల్లోని వృద్ధులందరికి టీకాలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమం లో జిల్లా ప్రొగ్రాం అధికారి డాక్టర్‌ లక్ష్మీకర్‌, పర్యవేక్షకులు వెంకటరెడ్డి, వైద్యాధికారులు దీపిక, హజరయ్య, మేరీ దీప్తి, సిబ్బంది పాల్గొన్నారు. 

వందశాతం వ్యాక్సిన్‌ పూర్తి చేయాలి

మైలవరం, జూన్‌ 12: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 45 సం వత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికీ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వేసి వంద శాతం ప్రక్రియ పూర్తి చేయాలని  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికా రి అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం మైలవరం, వద్దిరాల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 సంవత్సరాలు పైబడిన వారికి వందశాతం వ్యాక్సిన్‌ అందించాలని ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు అజరయ్య, సునీల్‌కుమార్‌, మేరీదీప్తిలను తెలిపారు. నాడు- నేడు కింద జరుగుతున్న పనుల పై ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం  అందించాల న్నారు.  కార్యక్రమంలో డాక్టర్‌ రత్నా కర్‌, వెంకటరెడ్డి, వైద్య సిబ్బంది రామమోహన్‌, విజయ్‌కు మార్‌, సువార్తమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-13T05:06:53+05:30 IST