భయం వద్దు..

ABN , First Publish Date - 2021-01-25T05:52:04+05:30 IST

కరోనా మహమ్మారి నివారణకు వ్యాక్సిన అందుబాటులోకి వచ్చింది. కరోనా పోరులో ముందుండి పోరాడుతున్న ఫ్రంట్‌ లైన వారియర్స్‌కు తొలివిడతలో టీకా ఇస్తున్నారు. అయితే రకరకాల అపోహలు, ఆందోళనలతో ఫ్రంట్‌లైన వారియర్స్‌ టీకా పట్ల ఆసక్తి చూపడం లేదు.

భయం వద్దు..

వ్యాక్సిన సురక్షితమైనదే

వైద్య నిపుణుల సూచన

అవగాహన కల్పిస్తున్న వైద్యాధికారులు

కడప, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి నివారణకు వ్యాక్సిన అందుబాటులోకి వచ్చింది. కరోనా పోరులో ముందుండి పోరాడుతున్న ఫ్రంట్‌ లైన వారియర్స్‌కు తొలివిడతలో టీకా ఇస్తున్నారు. అయితే రకరకాల అపోహలు, ఆందోళనలతో ఫ్రంట్‌లైన వారియర్స్‌ టీకా పట్ల ఆసక్తి చూపడం లేదు. టీకా నాణ్యమైనది, సురక్షితమైనది, భయం వద్దు అంటూ వైద్యాధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో కరోనా కేసులు ఆదివారం నాటికి 55,400కు చేరుకున్నాయి. వ్యాధి తగ్గుముఖం పట్టినప్పటికీ కరోనాపై భయం వీడలేదు. ఇలాంటి తరుణంలో టీకా అందుబాటులోకి వచ్చింది. తొలి విడతలో ఫ్రంట్‌లైన వారియర్స్‌ అయిన వైద్యులు, ఏఎనఎం, అంగన్వాడీ కార్యకర్తలు, పారా మెడికల్‌ సిబ్బంది, ల్యాబ్‌ టెక్నీషియన్సకు టీకా వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో 23 వేల మందికి టీకా ఇవ్వాలని నిర్ణయించారు. ఈనెల 16న వ్యాక్సినేషనకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గానికి రెండు కేంద్రాల చొప్పున తొలుత 20 కేంద్రాల ద్వారా ఒక్కో కేంద్రంలో కనీసం వంద మందికి వ్యాక్సిన వేసేలా సరఫరా చేశారు. వ్యాక్సినేషన సక్సెస్‌ చేసేందుకు గాను తొలుత ట్రయల్‌రన నిర్వహించారు. ఈనెల 16న 2 వేల మందికి వ్యాక్సినేషన వేయాలని లక్ష్యంగా కాగా తొలిరోజు 1147 మంది వ్యాక్సిన వేయించుకున్నారు. శనివారం నాటికి 10,500 మందికి టీకా వేశారు. మిగతా వారికి కూడా వ్యాక్సిన వేస్తామని డీఎంహెచవో అనిల్‌కుమార్‌ ఆంధ్రజ్యోతికి వివరించారు. టీకా సురక్షితమైనదే అయినప్పటికీ రకరకాల పుకార్లు, అనుమానాలతో కొందరు వ్యాక్సినేషనకు ముందుకు రానట్లు తెలుస్తోంది. టీకా సురక్షితమైనదేనని, దుష్ప్రభావాలు ఉండవని నొక్కి చెబుతున్నారు. సర్వర్‌ ప్రాబ్లంతో ఫ్రంట్‌ లైన వారియర్స్‌ వివరాల నమోదులో సమస్య రావడంతో టీకా కార్యక్రమం స్లోగా జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇటీవలనే ఆ సమస్య పరిష్కరించడంతో అందరికీ టీకా వేయవచ్చని డీఎంహెచవో చెబుతున్నారు. 


అపోహలొద్దు  

- అనిల్‌కుమార్‌, డీఎంహెచవో

కరోనా టీకాపై ఎలాంటి అపోహలొద్దు. టీకా సురక్షితమైనది. టీకా వల్ల దుష్ప్రభావాలు ఉండవు. ఏవైనా అపోహలుంటే స్థానికంగా ఉన్న వైద్యాధికారులను అడిగి తెలుసుకోవాలి. జిల్లావ్యాప్తంగా 68 కేంద్రాల్లో వ్యాక్సినేషన కార్యక్రమం జరుగుతోంది. 16న 1147 మందికి టీకాలు వేశారు. 17న 900, 18న 837, 19న 896, 20న 2739, 21న 1344, 22న 1451, 23న 943 మందికి వ్యాక్సిన వేశాము.


4 పాజిటివ్‌ కేసులు నమోదు

కడప, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు 55,400కు చేరుకున్నాయి. ఆదివారం కొత్తగా మరో నలుగురికి వైరస్‌ సోకింది. ఇప్పటివరకు 533 మంది మృతి చెందారు. కొవిడ్‌ ఆసుపతిల్రో కోలుకున్న ఒకరిని డిశ్చార్జి చేయగా ఇప్పటి వరకు 54,813 మంది చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. 56 మంది హోం ఐసోలేషనలో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2021-01-25T05:52:04+05:30 IST