డ్రగ్స్‌కు బానిస కావద్దు

ABN , First Publish Date - 2022-06-26T06:33:07+05:30 IST

డ్రగ్స్‌కు యువత బానిస కావద్దని ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రపంచ మాదకద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా హెల్పింగ్‌ హార్ట్స్‌ రూపొందించిన ‘డ్రగ్స్‌కు యువత బానిస కావద్దు...బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు’ అనే కరపత్రాన్ని ఆవిష్కరించారు.

డ్రగ్స్‌కు బానిస కావద్దు
డ్రగ్స్‌ నివారణపై కరపత్రం ఆవిష్కరిస్తున్న ఎస్పీ రాహుల్‌ హెగ్డే

సిరిసిల్ల క్రైం, జూన్‌ 25: డ్రగ్స్‌కు యువత బానిస కావద్దని ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రపంచ మాదకద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా హెల్పింగ్‌ హార్ట్స్‌ రూపొందించిన ‘డ్రగ్స్‌కు యువత బానిస కావద్దు...బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు’ అనే కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్‌ వాడకం సంతోషంతో మొదలై దుఖంతో అంతమవుతుందన్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై  నిత్యం దృష్టిపెట్టాలన్నారు. ప్రవర్తనలో మార్పులు ఎప్పటికప్పుడు గమనించాలని, సరైన మార్గదర్శనం చేయాలని అన్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన తర్వాత బాధపడితే ప్రయోజనం లేదని భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టిన వారవుతారని అన్నారు. మెదడు. నరాల వ్యవస్థ దెబ్బతిని శాశ్వత మానసిక వైకల్యం వచ్చే అవకాశాలు  ఉంటాయన్నారు. నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రాఫిక్‌ సబ్‌స్టాన్స్‌ యాక్ట్‌ 1985 ప్రకారం శిక్షార్హులు అవుతారన్నారు. మాదక ద్రవ్యాలు అమ్మడం, తీసుకోవడం నేరమన్నారు.   పోలీసుశాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై  అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. హెల్పింగ్‌ హార్ట్స్‌ స్వచ్ఛందసంస్థ డ్రగ్స్‌పై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు.   కార్యక్రమంలో సైకాలజిస్ట్‌ కె. పున్నం చందర్‌, హెల్పింగ్‌ హార్ట్స్‌ అధ్యక్షుడు అలువాల ఈశ్వర్‌, న్యాయవాది తిరుమల, కరాటే మాస్టర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T06:33:07+05:30 IST