ఇలా చేసి చూడండి!

ABN , First Publish Date - 2021-03-25T05:30:00+05:30 IST

వాల్‌నట్స్‌లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు బాగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని

ఇలా చేసి చూడండి!

 వాల్‌నట్స్‌లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు బాగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి నాజూగ్గా కనిపించేలా చేస్తాయి. అంతేకాకుండా ఎండలో తిరిగినపుడు దాని ప్రభావం చర్మంపై పడకుండా కాపాడతాయి. 


 కళ్లు పెద్దగా కనిపించాలంటే నలుపురంగు ఐలైనర్‌ కాకుండా బ్రౌన్‌ ఐలైనర్‌ వాడాలి.


 లిప్‌స్టిక్‌ వేసుకోవడానికి  ఒక గంట ముందు  దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి తర్వాత ఆ లిప్‌స్టిక్‌ని పెదాలపై రాసుకుంటే ఎక్కువసేపు ఉంటుంది.


 మునగాకులను మెత్తగా  నూరి అందులో కొద్దిగా నిమ్మరసం వేసి పేస్టులా చేసి ముఖానికి పూతలా వేసుకోవాలి. అది ఆరిపోయే వరకూ అలాగే ఉంచుకుని తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. 


 పొడిచర్మం వాళ్లు బాగా  వేడిగా ఉన్న నీళ్లతో స్నానం చేయకూడదు. అలా చేస్తే చర్మం మరింత పొడిబారినట్టవుతుంది. వీళ్లు ఒంటికి సబ్బులు కాకుండా క్లెన్సర్లు లేదా షవర్‌ జెల్‌ని వాడితే చర్మం మృదువుగా అవుతుంది. వీళ్ల చర్మంలోని పొడిబారిపోయే గుణం కూడా తగ్గుతుంది. 


 ఒక గిన్నెలో రెండు గుడ్లు, రెండు చెంచాల పెరుగు, కొన్ని చుక్కల తేనె, కొద్దిగా నిమ్మరసం వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి. ఆ పేస్టును జుట్టుకు పట్టించి అరగంట తర్వాత  నీళ్లతో శుభ్రంగా కడిగేసుకుంటే జుట్టు పట్టులా అవుతుంది.ఫ   



Updated Date - 2021-03-25T05:30:00+05:30 IST