మీ వంశ వృక్షం తెలుసా!

ABN , First Publish Date - 2020-04-08T06:06:54+05:30 IST

లాక్‌డౌన్‌ మూలంగా ఇంటి పట్టునే ఉంటున్నారు. ఇండోర్‌ గేమ్స్‌, కంప్యూటర్‌, స్మార్ట్‌ఫోన్‌తో ఎప్పుడూ గడిపితే బోర్‌ కొడుతుంది.

మీ వంశ వృక్షం తెలుసా!

లాక్‌డౌన్‌ మూలంగా ఇంటి పట్టునే ఉంటున్నారు. ఇండోర్‌ గేమ్స్‌, కంప్యూటర్‌, స్మార్ట్‌ఫోన్‌తో ఎప్పుడూ గడిపితే బోర్‌ కొడుతుంది. అందుకే మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలతో ఫ్యామిలీ ట్రీని తయారుచేయండి. 

మీ ముత్తాతల గురించి తెలుసుకోవడానికి, బంధువుల గురించి 

కనుక్కోవడానికి ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది.

పెద్ద చార్ట్‌ తీసుకొని, అమ్మ నాన్నలను అడుగుతూ ఫ్యామిలీ ట్రీ 

వివరాలు రాయండి. కంప్యూటర్‌ ఉంటే కనుక అందులోనూ ప్రిపేర్‌ చేయవచ్చు.

కుటుంబసభ్యుల పేర్లు, వయస్సు, బంధుత్వం వివరాలు రాయడం మరిచిపోవద్దు. 

తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ ఊర్లో ఉండి ఉంటే ఫోన్‌ చేసి వివరాలు చెప్పమని అడగండి. ఆ వివరాలను జాగ్రత్తగా నమోదు చేయండి.

అందుబాటులో ఉన్న ఫొటోలను అతికించండి. ఇంట్లో ఉన్న 

అల్బమ్‌లు, ఫంక్షన్ల సమయంలో తీసిన ఫొటోలు చెక్‌ చేయండి. కచ్చితంగా కొందరు ఫొటోలైనా దొరుకుతాయి.

ఇప్పుడందరూ స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారు కాబట్టి ఫోన్‌ చేసి 

వాట్స్‌పలో ఫొటో పంపమని అడగొచ్చు.

వీలైతే పుట్టిన సంవత్సరాలు, పుట్టిన ప్రదేశం పేర్లు కూడా రాయండి. ఫ్యామిలీ ట్రీ పూర్తయ్యాక డాడీని అడిగి సోషల్‌ మీడియా అకౌంట్‌లో పోస్ట్‌ చేయండి. 

మీరు చేసిన ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటారు. 

Updated Date - 2020-04-08T06:06:54+05:30 IST