వీఆర్వో పదోన్నతుల్లో న్యాయం చేయండి

ABN , First Publish Date - 2020-08-03T09:45:28+05:30 IST

జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రామ రెవెన్యూ అధికారి పోస్టులలో గ్రామ రెవెన్యూ సహాయకులకు పదోన్నతుల్లో సీనియార్టీకి ..

వీఆర్వో పదోన్నతుల్లో న్యాయం చేయండి

విశాఖపట్నం, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రామ రెవెన్యూ అధికారి పోస్టులలో గ్రామ రెవెన్యూ సహాయకులకు పదోన్నతుల్లో సీనియార్టీకి తిలోదకాలిచ్చారని ప్రగతిశీల మహిళా సంఘం ఆరోపించింది. ఆదివారం చినముషిడివాడలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ప్రగతిశీల మహిళా సంఘం నిరసన కార్యక్రమం నిర్వహించారు.


ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి ఎం. లక్ష్మి మాట్లాడుతూ వీఆర్వో పదోన్నతి కోసం ఎంపికచేసిన గ్రామ రెవెన్యూ సహాయకుల జాబితాను జిల్లాలో తహసీల్దార్లకు పంపి అభ్యంతరాలుంటే వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారన్నారు. అయితే పదోన్నతి పొందేందుకు అర్హులై ఉండి జాబితాలో లేని అభ్యర్థుల నుంచి వినతులు తీసుకోకుండానే ఈ నెల మూడో తేదీన కలెక్టరేట్‌లో పదోన్నతుల ప్రక్రియ నిర్వహిస్తున్నారన్నారు. అర్హతలు ఉండి పదోన్నతుల కౌన్సెలింగ్‌ సమయంలో వివక్షతకు గురైన దళిత వీఆర్‌ఏలకు న్యాయం చేయాలన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జరపాల్సిన కౌన్సెలింగ్‌ వాయిదా వేసి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు పరిశీలించాలని ఆమె డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-08-03T09:45:28+05:30 IST