‘మా గూడు మాకిప్పించి న్యాయం చేయండి’

ABN , First Publish Date - 2021-09-17T06:41:18+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగి తిరుపాలు, అతడి కుమా రులు కబ్జా చేసిన తమ షెడ్లను తమకు ఇప్పించి న్యాయం చేయాలని కక్కలపల్లి పంచా యతీకి చెందిన మహిళలు శ్రీదేవి, నాగలక్ష్మి, మరియమ్మ, ప్రేమలత, సుంకమ్మ, జయసుధ కోరారు.

‘మా గూడు మాకిప్పించి న్యాయం చేయండి’

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, సెప్టెంబరు16 : ప్రభుత్వ ఉద్యోగి తిరుపాలు, అతడి కుమా రులు కబ్జా చేసిన తమ షెడ్లను తమకు ఇప్పించి న్యాయం చేయాలని కక్కలపల్లి పంచా యతీకి చెందిన మహిళలు శ్రీదేవి, నాగలక్ష్మి, మరియమ్మ, ప్రేమలత, సుంకమ్మ, జయసుధ కోరారు. వారు గురువారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇలా తెలి పారు. కక్కలపల్లి పంచాయతీలోని సర్వే నెం. 247/2ఏ, 2బీలలోని 2.12 ఎకరాల్లో ఎస్సీలకు... 2011 సంవత్సరంలో అప్పటి ఎమ్మార్వో రామకృష్ణారెడ్డి ఇళ్ల పట్టాలు పట్టాలిచ్చారన్నారు. ఆ స్థలాల్లోనే షెడ్లు వేసుకుని వాటిలో ఉంటున్నామన్నారు. అయితే స్థానికంగా ఉన్న తిరు పాలు, ఆయన కుమారులు వాటికి తాళాలు వేశారన్నారు. ఈ స్థలం మాది... ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నార న్నారు.  వారు 2018 సంవత్సరంలో వారిపేర్లపై నకిలీ పట్టాలను సృష్టించుకొని తమపై దౌర్జన్యాలకు దిగుతున్నారని వాపోయారు. ఈ విషయంలో ఆర్డీఓ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. 

Updated Date - 2021-09-17T06:41:18+05:30 IST