చీమలు నిద్రపోతాయా

ABN , First Publish Date - 2022-05-30T06:01:52+05:30 IST

చీమలు నివసించే ప్రదేశాన్ని కాలనీ అంటారు. ఒక్కో కాలనీలో కొన్ని వేల చీమలు నివసిస్తాయి.

చీమలు నిద్రపోతాయా

చీమలు నివసించే ప్రదేశాన్ని కాలనీ అంటారు. ఒక్కో కాలనీలో కొన్ని వేల చీమలు నివసిస్తాయి. అందులో మూడు రకాల చీమలు ఉంటాయి. ఒకటి క్వీన్‌, రెండోది మేల్స్‌, మూడోది ఫిమేల్‌ వర్కర్‌. 

ఫిమేల్‌ వర్కర్‌ చీమలు గుట్టలను మట్టితో నిర్మిస్తాయి. అంతేకాకుండా అక్కడ నివసించే చీమలన్నింటికి ఆహారాన్ని సేకరించే బాధ్యత కూడా వీటిపైనే ఉంటుంది.

ఇవి నిర్మించే గుట్టల్లో గదులు, టన్నెల్స్‌ ఉంటాయి. వాటిలో అవి ఆహారాన్ని భద్రపరుస్తాయి. 

ఏ చీమ కుడితే ఎక్కువ నొప్పి పుడుతుందో తెలుసా? బుల్లెట్‌ చీమ. 

చీమలకు కంటిచూపు చాలా బాగుంటుంది. వాటి కళ్లలో చాలా లెన్స్‌లు ఉంటాయి. 

చీమల జీవితకాలం 45 నుంచి 60 రోజుల పాటు ఉంటుంది.

చీమలు వాటి శరీరంపై ఉన్న రంధ్రాల ద్వారా శ్వాసిస్తుంటాయి. భూమిపై వాటి పాదాన్ని ఉంచి వైబ్రేషన్స్‌ను గుర్తిస్తుంటాయి.

వాటి తలపై ఉండే యాంటెన్నా ఆధారంగా సంభాషించుకుంటుంటాయి. ఇక మరో విశేషం ఏమిటంటే చీమలు నిద్రపోవు.

Updated Date - 2022-05-30T06:01:52+05:30 IST