Abn logo
Sep 17 2020 @ 09:33AM

వైరల్‌ అవుతున్న స్టాలిన్‌ విలక్షణ ఫొటో

చెన్నై : డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లు, పార్టీ కార్యాలయం నుంచే ఆన్‌లైన్‌ ద్వారా జిల్లా పార్టీ నేతలతో మాట్లాడుతున్న స్టాలిన్‌, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో వీడియో ద్వారా చర్చలు. రాష్ట్ర కమిటీ సమావేశం, తాజాగా పార్టీ సర్వసభ్య సమావేశం కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించి ఆశ్చర్యం కలిగించారు. ఆధునిక టెక్నాలజీ ద్వారా స్టాలిన్‌ చేపట్టిన చర్యలను ఇటీవల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ప్రశంసించారు. ఈ నేపథ్యంలో, ఇటీవల స్టాలిన్‌ నగరంలో సైకిల్‌ మీద వెళుతూ తీసిన వీడియో దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

తాజాగా, ఉదయాన్నే సైక్లింగ్‌ వెళ్లిన స్టాలిన్‌ తలపై హెల్మెట్‌తో పాటు ‘తమిళం మా ప్రాణం’ అనే వ్యాఖ్యలతో బాటు దివంగత ముఖ్యమంత్రులు కరుణానిధి, తందై పెరియార్‌, అన్నాదురైలతో చిత్రాలతో కూడిన టీ-షర్టును ధరించి ఫొటోకు ఫోజులిచ్చారు. తాజాగా ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా, ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు ‘బ్యాన్‌ నీట్‌’ పేరుతో వున్న మాస్కును పార్టీ ఎమ్మెల్యేతో పాటు స్టాలిన్‌ ధరించి పాల్గొనడం గమనార్హం.

Advertisement
Advertisement
Advertisement