మాజీ ఎంపీని పార్టీ నుంచి తొలగించిన స్టాలిన్

ABN , First Publish Date - 2020-04-03T15:00:18+05:30 IST

మాజీ ఎంపీని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు

మాజీ ఎంపీని పార్టీ నుంచి తొలగించిన స్టాలిన్

చెన్నై : డీఎంకే వ్యవసాయ శాఖ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ కేబీ రామలింగంను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ప్రకటించారు. ఈ మేరకు తేనాంపేటలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయం గురువారం విడుదల చేసిన ప్రకటనలో.... ఇటీవల ‘కరోనా’ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొనే చర్యలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. 


దీనిపై మాజీ ఎంపీ రామలింగం స్పందిస్తూ... కరోనా వైరస్‌ వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టిందని, కరోనా బాధితులకు ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేయడంతో పాటు, లక్షణాలున్నట్లు నిర్ధారణ కాని వారిని కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుందని, ఈ పరిస్థితుల్లో అఖిలపక్ష సమావేశం అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇది డీఎంకే శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో, ఆయనను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌ ప్రకటించారు. కాగా, ఎంజీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రామలింగం అన్నాడీఎంకే ఎంపీగా చేశారు. తరువాత ఆ పార్టీ నుండి వైదొలిగి డీఎంకేలో చేరారు.

Updated Date - 2020-04-03T15:00:18+05:30 IST