Allegation of MP: 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో భారీ అవినీతి

ABN , First Publish Date - 2022-08-04T16:28:26+05:30 IST

ఇటీవల ముగిసిన 5జీ స్పెక్ట్రమ్‌ వేలం పాటలలో భారీ స్థాయి అవినీతి చోటుచేసుకుందని డీఎంకే ఎంపీ ఎ. రాజా(DMK MP A. Raja) ఆరోపించారు. ఢిల్లీలో

Allegation of MP: 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో భారీ అవినీతి

                                - డీఎంకే ఎంపీ ఎ. రాజా ఆరోపణ


చెన్నై, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఇటీవల ముగిసిన 5జీ స్పెక్ట్రమ్‌ వేలం పాటలలో భారీ స్థాయి అవినీతి చోటుచేసుకుందని డీఎంకే ఎంపీ ఎ. రాజా(DMK MP A. Raja) ఆరోపించారు. ఢిల్లీలో బుధవారం ఉదయం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం 5జీ స్పెక్ట్రమ్‌ వేలం పాటల ద్వారా రూ. ఐదు లక్షల కోట్ల వరకూ ఆదాయం లభిస్తుందని గొప్పలు చెప్పుకొందని, అయితే రూ.1.25 లక్షల కోట్లకే వేలంపాటను ఖరారు చేసిందని చెప్పారు. ఈ వేలం పాటల ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు రూ. ఐదు లక్షల కోట్ల(Rs. Five lakh crores) మేరకు ఆదాయం రాకపోవడంతో ఈ వ్యవహారంలో భారీ స్థాయిలో అవినీతి జరిగి ఉంటుందని ఆయన ఆరోపించారు.

Updated Date - 2022-08-04T16:28:26+05:30 IST