ఆధిక్యాల్లో దూసుకెళ్తున్న స్టాలిన్ పార్టీ.. భారీగా సీట్లు కోల్పోతున్న అన్నాడీఎంకే..!

ABN , First Publish Date - 2021-05-02T15:14:44+05:30 IST

తమిళనాడులో డీఎంకే, అన్నాడిఎంకే నున్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు డీఎంకే కొంతమేర ఆధిక్యం చూపుతోంది.

ఆధిక్యాల్లో దూసుకెళ్తున్న స్టాలిన్ పార్టీ.. భారీగా సీట్లు కోల్పోతున్న అన్నాడీఎంకే..!

చెన్నై: తమిళనాడులో డీఎంకే, అన్నాడిఎంకే నున్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు డీఎంకే కొంతమేర ఆధిక్యం చూపుతోంది. అటు విశ్వనటుడు కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎం మరోసారి నిరాశ పరిచింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన కమల్ పార్టీ కేవలం ఒకే చోట ఆధిక్యంలో ఉంది. అటు ఏఎంఎంకే కూటమి రెండు చోట్ల ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు(ఉదయం 9.30 గంటల వరకు) అందిన సమాచారం ప్రకారం ప్రధాన పోటీదారులు డీఎంకే కూటమి 78 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే.. అన్నాడిఎంకే కూటమి 65 చోట్ల ఆధిక్యంలో ఉంది. దీంతో ఇరు పార్టీల మధ్య పోరు ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇక గత 2016 ఎన్నికల కంటే ఈసారి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే భారీగా పుంజుకోవడం గమనార్హం. అటు కిందటి ఎన్నికలతో పోలిస్తే ఈసారి అన్నాడీఎంకే భారీగా స్థానాలు కోల్పోతుండడం గమనించిన దగిన విషయం.   

Updated Date - 2021-05-02T15:14:44+05:30 IST