Shocking Incident: 65 ఏళ్ల వయసులో ఆమెపై ఆశ పుట్టింది.. ఆమె కూడా కనెక్ట్ అయింది.. కానీ ఊహించని ట్విస్ట్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-05-15T23:10:20+05:30 IST

ఆర్థిక లావాదేవీల్లో ఏర్పడ్డ తగాదాల నేపథ్యంలో మనలి ప్రాంతానికి చెందిన డీఎంకే నాయకుడు, ఫైనాన్షియర్‌ చక్రపాణిని కొందరు ముక్కముక్కలుగా నరికి శరీర భాగాలను..

Shocking Incident: 65 ఏళ్ల వయసులో ఆమెపై ఆశ పుట్టింది.. ఆమె కూడా కనెక్ట్ అయింది.. కానీ ఊహించని ట్విస్ట్ ఏంటంటే..

అడయార్‌(చెన్నై): ఆర్థిక లావాదేవీల్లో ఏర్పడ్డ తగాదాల నేపథ్యంలో మనలి ప్రాంతానికి చెందిన డీఎంకే నాయకుడు, ఫైనాన్షియర్‌ చక్రపాణిని కొందరు ముక్కముక్కలుగా నరికి శరీర భాగాలను కూవం మురుగుకాలువలో పడేశారు. ఈ కేసులో ఒక మహిళతో పాటు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఈ హత్య తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు గురైన చక్రపాణి తల మినహా మిగిలిన దేహపు భాగాలను పోలీసులు సేకరించారు. అయితే అడయార్‌ సమీపంలోని కూవం మురుగు కాలువలో పడేసిన తల మాత్రం ఇంకా లభించలేదు. స్థానిక పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహకారంతో రబ్బరు బోట్లపై కూవం మురుగు కాలువలలో తల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.


మనలి 7వ వార్డు ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల చక్రపాణి డీఎంకే జిల్లా శాఖ ప్రతినిధిగా ఉన్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చక్రపాణి రాజకీయ నేతగా ఉంటూనే మరోవైపు ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నారు. దీంతో రోజూ సాయంత్రం వడ్డీలను వసూలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఈ నెల 10న వడ్డీ వసూళ్ల కోసం వెళ్ళిన చక్రపాణి ఇంటికి తిరిగి రాలేదు. మొబైల్‌కు ఫోన్‌ చేసినా స్విచ్చాఫ్‌ అని వచ్చింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు... ఆయన మొబైల్‌ నంబరును ట్రేస్‌ చేయగా, దాని సిగ్నల్‌ రాయపురం గ్రేస్‌ గార్డెన్‌ 3వ వీధిలోని ఓ ఇంట్లో ఉన్నట్టు తెలిసింది.



దీంతో రాయపురం పోలీసుల సహకారంతో అక్కడికి వెళ్ళి చూడగా, ఒక ఇంటి ముందు చక్రపాణి బైక్‌ ఆగివుండటాన్ని గుర్తించారు. ఆ ఇంట్లోకి వెళ్ళి చూడగా కత్తులతో ముక్కలుగా నరికిన చక్రపాణి మృతదేహపు భాగాలు లభించాయి. కానీ తలతో పాటు మరికొన్ని భాగాలు కనిపించలేదు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసిన బిత్తరపోయిన పోలీసులు ఇంట్లో ఉన్న తమీమ్‌భాను (39) అనే మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆ మహిళ తన సోదరుడు వాసీం బాషా (37)తో కలిసి చక్రపాణిని హత్య చేసినట్టు అంగీకరించింది. ఆ తర్వాత వీరిద్దరిని రాయపురం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్ళి విచారించగా అసలు విషయం తెలిసింది. అయితే.. ఈ హత్యకు అసలు కారణం వేరే ఉందని పోలీసుల విచారణలో తేలింది. చక్రపాణి ఇంట్లో మూడేళ్లుగా అస్లాం, అతని భార్య తమీమ్‌భాను నివాసం ఉంటున్నారు. తమీమ్‌భాను ఇంటి వద్దే ఉండేది. అస్లాం రోడ్డు పక్కన బట్టలు అమ్మే వ్యాపారం చేస్తూ పొరుగు ఊర్లకు వెళుతుండేవాడు. వారానికి ఒకసారి మాత్రమే ఇంటికొచ్చేవాడు. అస్లాంకు ఇద్దరు కుమార్తెలు. ఒకరి వయసు 14 ఏళ్లు, మరొకరి వయసు 12 ఏళ్లు.



వడ్డీ వ్యాపారం చేస్తున్న ఇంటి యజమాని చక్రపాణికి అస్లాం భార్య తమీమ్‌భాను వడ్డీకి తిప్పమని డబ్బులిచ్చేది. నెలనెలా ఆమెకు ఠంచనుగా వడ్డీ చక్రపాణి వడ్డీ చెల్లించేవాడు. ఈ క్రమంలో చక్రపాణికి, తమీమ్‌భానుకి మధ్య పరిచయం ఏర్పడింది. అస్లాం కూడా రోజూ ఇంట్లో ఉండే వ్యక్తి కాకపోవడంతో ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఏకంగా తమీమ్‌భాను ఇంట్లోనే వీళ్లు రాసలీలలుసాగించేవారు. ఈ విషయం భర్తకు తెలిసి ఇల్లు ఖాళీ చేసి చెన్నైలోనే మరో ప్రాంతంలో ఇల్లు తీసుకున్నారు. ఆ అపార్ట్‌మెంట్‌లోనే తమీమ్‌భాను సోదరుడు పాషా కూడా కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అయినా చక్రపాణి, తమీమ్‌భాను తమ వివాహేతర సంబంధాన్ని రహస్యంగా కొనసాగించారు. ఇలా కొన్నాళ్లు గడిచాక అదే ఇంటి కింది ఫ్లోర్‌లో ఉండే డ్రైవర్ ఢిల్లీ బాబు అనే 29 ఏళ్ల యువకుడితో కూడా తమీమ్‌భాను వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఢిల్లీ బాబు, పాషా స్నేహితులు కావడం గమనార్హం. చక్రపాణికి తెలియకుండా ఢిల్లీ బాబు, తమీమ్‌భాను పలుమార్లు కలిశారు.



ఈ క్రమంలో.. మే 10వ తేదీన రాత్రి పొద్దుపోయాక తమీమ్‌భాను ఇంటికి చక్రపాణి వెళ్లాడు. బైక్ బయట ఉంచి ఇంట్లోకి వెళ్లి తమీమ్‌భానును చూడగానే కౌగిలించుకున్నాడు. ఇద్దరు కూతుర్లు ఇంట్లోనే ఉన్నారని, ఇప్పుడు కుదరదని తమీమ్‌భాను చెప్పినా చక్రపాణి వినిపించుకోలేదు. చక్రపాణి ప్రవర్తనతో బెంబేలెత్తిపోయిన తమీమ్‌భాను భయంతో కేకలేసింది. ఆ కేకలు, అరుపులు విని ఆమె సోదరుడు పాషా ఇంట్లోకి వెళ్లి చూడగా చక్రపాణి ఆమెను బలవంతం చేస్తూ కనిపించాడు. కోపంతో ఊగిపోయిన పాషా, ఆమె చెల్లి తమీమ్‌భాను సాయంతో చక్రపాణిని కిందపడేశారు. కత్తితో ప్రాణం పోయేదాకా పొడిచి చంపారు. అంతటితో ఆగకుండా తలను, మొండాన్ని వేరుచేశారు. ఆ తలను ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌లో ప్యాక్ చేశారు. ఆ తర్వాత శరీర భాగాలను కూడా ముక్కలుగా చేసి ఒక గోనె సంచిలో ఆ ముక్కలను ఉంచారు. ఢిల్లీ బాబుకు సమాచారం ఇచ్చారు. డ్రైవర్‌గా పనిచేస్తున్న ఢిల్లీ బాబు కారు తీసుకుని వచ్చాడు. ఆ కారులో చక్రపాణి తలను, శరీర భాగాలను తీసుకెళ్లి కూవం మురుగు కాలువలో పడేశారు. పోలీసులు ఈ ఘటనపై తమీమ్‌భాను, పాషా, ఢిల్లీ బాబుపై కేసు నమోదు చేశారు. హత్యకు గురైన వ్యక్తి డీఎంకే నేత కావడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Updated Date - 2022-05-15T23:10:20+05:30 IST