రాజ్యసభకు.. డీఎంకే అభ్యర్థులు ఖరారు..

ABN , First Publish Date - 2021-09-15T15:33:37+05:30 IST

చెన్నై, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు తమ పార్టీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను డీఎంకే ప్రకటించింది. అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యులు కేపీ మునుసామి, వైద్యలింగం

రాజ్యసభకు.. డీఎంకే అభ్యర్థులు ఖరారు..

చెన్నై, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు తమ పార్టీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను డీఎంకే ప్రకటించింది. అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యులు కేపీ మునుసామి, వైద్యలింగం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవటంతో రాజ్య సభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఆ రెండు సీట్లలో అధికార డీఎంకే పోటీ చేయనుంది. ఆ మేరకు దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎన్‌వీఎన్‌ సోము కుమార్తె డాక్టర్‌ కనిమొళి, డీఎంకే నామక్కల్‌ తూర్పు జిల్లా శాఖ ఇన్‌చార్జి  కేఆర్‌ఎన్‌ రాజేష్‌కుమార్‌లను తమ అభ్యర్థులుగా ఖరారు చేసి నట్టు పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.


వీరిలో డాక్టర్‌ కనిమొళి 2016లో జరిగిన ఎన్నికల్లో టి.నగర్‌ నియోజకవర్గంలో డీఎంకే తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు అక్టోబర్‌ 4న ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే నోటిఫికేషన్‌ జారీ చేసింది. శాసనసభలో అధికార డీఎంకే కూటమికి మెజారిటీ సభ్యులు వుండటంతో ఈ రెండు స్థానాల్లోనూ ఆ పార్టీ సులువుగా గెలిచే అవకాశం ఉంది. ఈ రెండు సీట్లకు ఇతర పార్టీలకు చెందినవారెవరూ పోటీ చేయక పోతే డాక్టర్‌ కనిమొళి, కేఆర్‌ఎన్‌ రాజేష్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.





Updated Date - 2021-09-15T15:33:37+05:30 IST