గర్భస్థ లింగ నిర్ధారణపై కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-04-17T06:01:49+05:30 IST

గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలపై కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కామేశ్వరప్రసాద్‌ హెచ్చరించారు.

గర్భస్థ లింగ నిర్ధారణపై కఠిన చర్యలు

జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కామేశ్వరప్రసాద్‌  

అనంతపురం వైద్యం, ఏప్రిల్‌ 16: గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలపై కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కామేశ్వరప్రసాద్‌ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో లింగ నిర్ధారణ నియంత్రణ చట్టంపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్కానింగ్‌ సెంటర్లో లింగ నిర్ధారణ పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదన్నారు. ఒక వేళ చేస్తే ఆ సెంటర్లతోపాటు డాక్టర్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు, న్యాయశాఖ, స్వ చ్ఛంద సంస్థల సహకారంతో చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తు న్నామన్నారు.  ఆడపిల్లల ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆరోగ్య కార్యకర్తలు గృహ సందర్శన చేసినప్పుడు ఈ చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. కమిటీ సభ్యులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు. సమావేశంలో అడిషనల్‌ డీఎంహెచఓ డాక్టర్‌ రా మసుబ్బారావు, డాక్టర్‌ చెన్నకేశవులు, డాక్టర్‌ నాగ శశిభూషణరెడ్డి, డాక్టర్‌ సుజాత, డాక్టర్‌ తిప్పయ్య, డీఎంఓ డాక్టర్‌ దోశారెడ్డి, డాక్టర్‌ బాలాకుమారి, డాక్టర్‌ భవా ని, న్యాయవాధి హరినాథ్‌రెడ్డి, డెమో లక్ష్మీనరసమ్మ, ఆర్డీటీ నుంచి హేమలత, ఎనజీఓ ప్రతినిధులు భానుజ, విజయ కుమార్‌, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.



Updated Date - 2021-04-17T06:01:49+05:30 IST