పీహెచ్‌సీల్లో కాన్పులు చేయాలి

ABN , First Publish Date - 2022-05-29T04:01:58+05:30 IST

ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాల్లో తప్పనిసరిగా కాన్పులు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పెంచలయ్య ఆదేశించారు.

పీహెచ్‌సీల్లో కాన్పులు చేయాలి
వైద్యాధికారులకు అవార్డులు అందజేస్తున్న డీఎంహెచ్‌వో

డీఎంహెచ్‌వో డాక్టర్‌ పెంచలయ్య 

30 పీహెచ్‌సీలకు అవార్డుల పంపిణీ

నెల్లూరు(వైద్యం), మే 28 : ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాల్లో తప్పనిసరిగా కాన్పులు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పెంచలయ్య ఆదేశించారు. శనివారం జిల్లాలోని పీహెచ్‌సీ, యుపీహెచ్‌సీ వైద్యులతో డీఎంహెచ్‌వో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులకు సాధారణ కాన్పులు చేసేలా  వైద్యాధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలన్నారు. రోజుకు 5వేల డోసుల లక్ష్యంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రికాషనరి డోసు 100 శాతం వేసి లక్ష్యాన్ని సాధించాలని తెలిపారు. ఫీవర్‌ సర్వే సమగ్రంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి రక్త పరీక్షలు చేసి చికిత్స అందించాలన్నారు. అజాదికా అంత్యోదయ కార్యక్రమాన్ని 90 రోజులు విజయవంతం చేయాలని సూచించారు. వైద్యులు తప్పనిసరిగా బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ వేయాలని ఆదేశించారు. అనంతరం నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌లో భాగంగా అత్యుత్తమ నాణ్యమైన సేవలు అందించిన 30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీటీడీసీ డాక్టర్‌ వెంకటప్రసాద్‌, పోగ్రాం అధికారులు డాక్టర్‌ భగీరథ, డాక్టర్‌ ప్రియంవద, డాక్టర్‌ దయాకర్‌, డాక్టర్‌ సుధీర్‌, డెమో శ్రీనివాసులు, మలేరియా అధికారి హుస్సేనమ్మ, డాక్టర్‌ అమరేంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌వో సహన, డిప్యూటీ డెమో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-29T04:01:58+05:30 IST