విధి నిర్వహణలో అలసత్వం వద్దు

ABN , First Publish Date - 2021-06-18T04:18:23+05:30 IST

వైద్యాధికారులు విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ శిరీష అన్నారు.

విధి నిర్వహణలో అలసత్వం వద్దు
సత్యనారాయణపురం వైద్యశాలలో మాట్లాడుతున్న శిరీష

కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో వేగం పెంచాలి 

వైద్యులు స్థానికంగా అందుబాటులో ఉండాలి

జిల్లా వైద్యాశాఖాధికారి శిరీష

చర్ల, జూన్‌ 17: వైద్యాధికారులు విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ శిరీష అన్నారు. గురువారం చర్ల మండలంలోని చర్ల, కొయ్యూ రు, సత్యనారాయణపురం ప్రభుత్వ వైద్యశాలలను ఆమె తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయా వైద్యశాలల్లోని పరిసరాలను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. అ నంతరం ఆమె మాట్లాడుతూ, వైద్యులు నిత్యం రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి ఉన్న నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలకు విరివిగా పరీక్షలు చేసి మందులు ఇవ్వాలని సూచించారు. అ నంతరం అఖిల వైద్యశాల, లక్ష్మికాలనీలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. వైద్యం అందుతున్న తీ రును అడిగితెలుసుకున్నారు. ఆమె వెంట వైద్యులు మౌనిక, శిరీష, శ్రీధర్‌, డీపీఎంవో చింతా సత్యనారాయణ ఉన్నారు. 

పీహెచ్‌సీలను సందర్శించిన డీఎంహెచ్‌వో

దుమ్ముగూడెం జూన్‌ 17: మండలంలోని పర్ణశాల, దుమ్ముగూడెం, నరసాపురం పీహెచ్‌సీలను జిల్లా వైద్యారో గ్యశాఖ అధికారి శిరీష గురువారం ఆకస్మికం గా సందర్శిం చారు. మూడు పీహెచ్‌సీల్లో కార్యాలయ రికార్డులతోపాటు, వ్యాక్సినేషన్‌, కరోనా పరీక్షల వివ రాలను పరిశీలించారు. తాత్కాలికంగా నిలిచిపోయిన ట్యూబెక్టమీ ఆపరేషన్లను పునఃప్రారంభించాలని సూ చించారు. ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉంచు కోవాలని ఆదేశించారు. కరోనా పాజి టివ్‌ రోగులను ఐసో లేషన్‌కు తరలించాలన్నారు. అందు బాటులో ఉన్న అన్ని వైద్యపరికరాలను సద్వినియోగం చేసుకోవాలని దుమ్ముగూ డెం పీహెచ్‌సీ సిబ్బందికి సూ చించారు. హరితహారంలో భాగంగా అన్ని పీహెచ్‌సీల్లో మొక్కలను నాటాలని అన్నా రు. కార్యక్రమంలో కాయకల్ప క్వాలిటీ మేనేజర్‌ శృతి, జ్యోతి, మణిదీప్‌ ఉన్నారు. 

Updated Date - 2021-06-18T04:18:23+05:30 IST