కాంట్రాక్టు పద్దతిలో పనిచేసేందుకు వైద్యులకు ఆహ్వానం

ABN , First Publish Date - 2020-08-13T21:19:44+05:30 IST

కరోనా వ్యాప్తి నేపధ్యంలో మరింత మంది వైద్యుల అవసరం దృష్ట్యా కాంట్రాక్టుపద్దతిలో వైద్యుల నియామకానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

కాంట్రాక్టు పద్దతిలో పనిచేసేందుకు వైద్యులకు ఆహ్వానం

హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి నేపధ్యంలో మరింత మంది వైద్యుల అవసరం దృష్ట్యా కాంట్రాక్టుపద్దతిలో వైద్యుల నియామకానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈమేరకు గాంధీహాస్పిటల్‌, టిమ్స్‌లో పనిచే సేందుకు 35 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ (జనరల్‌ మెడిసిన్‌)చ 35 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ (అనెస్తీషియా), మరో 15 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌(టీబీ అండ్‌ సిడి) నియాయమానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు డైరెక్టర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పేర్కొంది. ఎంపికైన వారు ఒక సంవత్సరం పాటు పనిచేయాలని, అవసరమైతే వారి సేవలను మరికొంత కాలం పొడిగిస్తామని అధికారులు తెలిపారు. నెలకు 1,25,000 రూపాయల వేతనంతో పాటు ఇంటెన్సివ్‌లు కూడా ఇవ్వనున్నట్టు తెఇలపారు. వైద్యవిద్యంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ చేసి ఒక సంవత్సరం సీనియర్‌ రెసిడెన్సీ చేసిన వారు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని డీఎంఈ అధికారులు తెలిపారు. 


ఈనెల 17వ తేదీన ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 5గంటలవరకు కోఠిలోని డిఎంహెచ్‌ఎస్‌ క్యాంపస్‌లోని డీఎంఈ ఆడిటోరియంలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. అభ్యర్ధులు ఒరిజినల్‌సర్టిఫికెట్‌లతో పాటు ఒకఫోటో, ఎస్‌ఎస్‌సి, ఎంబిబిఎస్‌, పిజి, సీనియర్‌ రెసిడెన్సీ సర్టిఫికెట్‌లు, కుల ధృవీకరణ సర్టిఫికెట్‌లు, రెండుపాస్‌పోర్ట్‌ సైజు ఫోటోలు, టీఎస్‌ మెడికల్‌ కౌన్సిల్‌ రిజిస్ర్టేషన్‌తో హాజరుకావాలని అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-08-13T21:19:44+05:30 IST