రేషన్‌కార్డుదారులకు రూ.3 వేల నగదు

ABN , First Publish Date - 2021-12-07T15:10:35+05:30 IST

సంక్రాంతిని పురస్కరించుకొని రేషన్‌ కార్డులకు రూ.3 వేల నగదు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డీఎండీకే డిమాండ్‌ చేసింది. కోయంబేడు సమీపంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆ పార్టీ జిల్లా

రేషన్‌కార్డుదారులకు రూ.3 వేల నగదు

                         - Dmdk డిమాండు


పెరంబూర్‌(చెన్నై): సంక్రాంతిని పురస్కరించుకొని రేషన్‌ కార్డులకు రూ.3 వేల నగదు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డీఎండీకే డిమాండ్‌ చేసింది. కోయంబేడు సమీపంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆ పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశం జరిగింది. పార్టీ కోశాధికారి ప్రేమలత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కార్యదర్శి సుధీష్‌ తదితరులు హాజరుకాగా, సమావేశంలో తొమ్మిది తీర్మానాలు ఆమోదించారు. కరోనా కారణంగా పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని, వారు సంక్రాంతి పండుగ జరుపు కొనేలా రేషన్‌కార్డుదా రులకు తలా రూ.3 వేలు ఇవ్వాలని తీర్మానం చేశారు. అలాగే, వరదలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.40 వేల పరిహారం చెల్లించాలి, ఒమైక్రాన్‌ భయాందోళన మధ్య రాష్ట్రానికి వచ్చే విమాన ప్రయాణికులను 15 రోజులు క్వారంటైన్‌లో ఉంచాలి, కరోనా, ఒమైకాన్‌ వైరస్‌లపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు కొవిడ్‌ నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా చూడాలి తదితర తీర్మానాలను సమావేశం ఆమోదిం చింది. త్వరలో జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించేలా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ముల్లైపెరియార్‌ డ్యాంలో 152 అడుగుల నీటిని నిల్వచేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని  కూడా సమావేశం తీర్మానించింది. ముందుగా కరోనాతో మృతిచెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలకు  సమావేశం సంతాపం తెలిపింది.

Updated Date - 2021-12-07T15:10:35+05:30 IST