‘విపత్తు’ అధికారులకు ఫిర్యాదు చేసుకోండి

ABN , First Publish Date - 2020-05-29T07:43:41+05:30 IST

లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ అధినేత

‘విపత్తు’ అధికారులకు ఫిర్యాదు చేసుకోండి

  • ‘లాక్‌డౌన్‌ ఉల్లంఘన’లపై పిటిషనర్లకు సూచించిన హైకోర్టు
  • వైసీపీ ఎమ్మెల్యేలు, చంద్రబాబు, లోకేశ్‌లపై దాఖలైన పిటిషన్ల పరిష్కారం


అమరావతి, మే 28(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు పరిష్కరించింది. ఈ వ్యవహారం విపత్తుల నిర్వహణ చట్టం (డీఎంఏ) పరిధిలోకి వస్తుందని, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని పిటిషనర్లకు సూచించింది. ఈ మేరకు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, వి.రజనీ, కె.సంజీవయ్య, ఎన్‌.వెంకటగౌడ్‌, బి.మధుసూదన్‌రెడ్డిలపై న్యాయవాది పారా కిశోర్‌, చంద్రబాబు, లోకేశ్‌లపై న్యాయవాది వంగా వెంకట్రామిరెడ్డి వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు.

Updated Date - 2020-05-29T07:43:41+05:30 IST