నిరుపేదలకు డీఎల్‌ఎస్‌ఏ సాయం

ABN , First Publish Date - 2020-05-11T11:36:09+05:30 IST

కడప నగరంతో పాటు సీకేదిన్నె మండలంలోని నిరుపేదలకు జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చైర్మన్‌, జిల్లా ప్రధాన జడ్జి జి.శ్రీనివాస్‌, సెక్రటరీ వెంకటరాజే్‌షకుమార్‌ల..

నిరుపేదలకు డీఎల్‌ఎస్‌ఏ సాయం

కడప (లీగల్‌), మే 10: కడప నగరంతో పాటు సీకేదిన్నె మండలంలోని నిరుపేదలకు జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చైర్మన్‌, జిల్లా ప్రధాన జడ్జి జి.శ్రీనివాస్‌, సెక్రటరీ వెంకటరాజే్‌షకుమార్‌ల ఆధ్వర్యంలో సంస్థలో పనిచేసే పారాలీగల్‌ వాలంటీర్ల ద్వారా సహాయం అందించారు. సీకేదిన్నె మండలం మద్దిమడుగు సమీపంలోని మున్సిపల్‌ వేస్ట్‌ డంపింగ్‌ యార్డు వద్ద నివశిస్తున్న గిరిజన కుటుంబాలకు మాస్క్‌లను, భోజన ప్యాకెట్లను, దుస్తులను అందజేశారు. అలాగే  అయాన్‌ చారిటబుల్‌ ట్రస్టు సహకారంతో నగరంలోని యాచకులకు నిరుపేదలకు నిత్యావసర సరుకులు హోమియోపతి మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఎల్‌వి జే.సురేష్‌ సహాయం, బి.వి.హరీ్‌షకుమార్‌, వసంత్‌, వలంటీర్‌ రాజా తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-05-11T11:36:09+05:30 IST