ఇళ్లు కట్టించి ఇచ్చే ఆప్షన్‌ మార్చండి

ABN , First Publish Date - 2021-01-19T05:29:07+05:30 IST

ఇళ్లు కట్టుకోవడంలో ప్రభుత్వం ఇచ్చిన మూడు ఆప్షన్‌లలో ఎక్కువమంది ప్రభుత్వమే గృహనిర్మాణం చేసి ఇచ్చేందేరూ మొగ్గు చూపారని, సాధ్యమైనంత వరకు మనం ఆ భారాన్ని తగ్గించాలని చేందుకు ప్రయత్నం చేయాలి. లేదంటే మనపై పడే భారాన్ని మనం తట్టుకోలేం... అని డీఎల్‌డీవో రాజేష్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు సూచించారు.

ఇళ్లు కట్టించి ఇచ్చే ఆప్షన్‌ మార్చండి

ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు డీఎల్‌డీవో రాజేష్‌ ఆదేశం

ప్రత్తిపాడు, జనవరి 18: ఇళ్లు కట్టుకోవడంలో ప్రభుత్వం ఇచ్చిన మూడు ఆప్షన్‌లలో ఎక్కువమంది ప్రభుత్వమే గృహనిర్మాణం చేసి ఇచ్చేందేరూ మొగ్గు చూపారని, సాధ్యమైనంత వరకు మనం ఆ భారాన్ని తగ్గించాలని చేందుకు ప్రయత్నం చేయాలి. లేదంటే మనపై పడే భారాన్ని మనం తట్టుకోలేం... అని డీఎల్‌డీవో రాజేష్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు సూచించారు. ప్రత్తిపాడు మండల పరిషత్‌ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. డీఎల్‌డీవో రాజేష్‌ మాట్లాడుతూ గృహ నిర్మాణానికి సంబందించి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఎక్కువమంది ఆప్షన్‌ను ఎంచుకున్నారని, వారితో మాట్లాడి ఆప్షన్‌ను మార్చాలని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు సూచించారు.  కార్యక్రమంలో హౌనింగ్‌ డీఈ దీనబాబు, ఏఈ నాగభూషణం, ఈవోపీఆర్డీ గిరిధర్‌, నియోజవకర్గ పరిధిలోని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-19T05:29:07+05:30 IST