పాదయాత్ర నేపథ్యంలో Shivakumar పూజలు

ABN , First Publish Date - 2022-01-09T17:48:59+05:30 IST

మేకెదాటు పాదయాత్రకు సిద్ధమైన కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఇంటిదేవుడికి పూజలు నిర్వహించారు. శనివారం ఉదయం రామనగర జిల్లా కనకపురలోని కెంకేరమ్మ, కబ్బాళమ్మ ఆలయంలో ప్రత్యేక

పాదయాత్ర నేపథ్యంలో Shivakumar పూజలు

బెంగళూరు: మేకెదాటు పాదయాత్రకు సిద్ధమైన కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఇంటిదేవుడికి పూజలు నిర్వహించారు. శనివారం ఉదయం రామనగర జిల్లా కనకపురలోని కెంకేరమ్మ, కబ్బాళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. భార్య, కుటుంబీకులతో కలసి పాల్గొన్నారు. డీకే శివకుమార్‌ ఏపని చేసినా ముందుగా ఇంటిదేవుడికి పూజలు చేసే సంప్రదాయం కొనసాగిస్తున్నారు. ఇదే సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ మేకెదాటు నుంచి పాదయాత్ర ఆదివారం ఉదయం ప్రారంభిస్తామన్నారు. ప్రతిపక్షనేత సిద్దరామయ్య, కొంతమంది ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు. బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు. కానీ వెనుకడుగు వేసే ఆలోచన లేదని, ముందుగా ప్రకటించినట్టుగానే యాత్ర కొనసాగుతుందన్నారు. రామనగర ప్రాంతానికి చెందినవారు ఐసీయూలో ఎంతమంది ఉన్నారో తెలియదుగానీ కర్ఫ్యూ పేరిట ఇబ్బంది కలిగిస్తున్నారన్నారు. 

Updated Date - 2022-01-09T17:48:59+05:30 IST